4
ముద్ర ప్రతినిధి, వనపర్తి : ఆర్టీసీల్లో రవాణాే మహిళా ప్రయాణికులతో మహబూబ్‌నగర్ ఆర్టీసీ రీజినల్ బస్సు మేనేజర్ సతీష్ కుమార్ అన్నారు. శనివారం ఆయన వనపర్తి డిపోను సందర్శించి డిపో ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిబ్బంది కృషితో 10 కోట్ల ఆదాయంతో నడుస్తున్నదని చెప్పారు. సిబ్బంది కష్టపడి మరింత ఆదాయం వచ్చేలా చూడాలన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులను ఈ సందర్భంగా ఆయన సత్కరించారు.
వనపర్తి నుండి గచ్చిబౌలికి ప్రత్యేక బస్సులు వనపర్తి నుండి హైదరాబాదులోని గచ్చిబౌలి కి నేరుగా బస్సులను నడుపుతున్నట్లు రీజనల్ మేనేజర్ సునీల్ కుమార్ తెలిపారు. దీనివల్ల వనపర్తి తో పాటు వనపర్తి పరిసర ప్రాంతాల్లోని ప్రయాణికులకు ఎంతో కొంత ఉంటుందని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన చెప్పారు.