- మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై టీటీడీ ఆగ్రహం
- టీటీడీ దర్శనం అనంతరం రాజకీయాలు మాట్లాడితే తీవ్ర పరిణామాలు
- చర్యలు తప్పవంటూ హెచ్చరించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు
ముద్ర, ఏపీ : తిరుమల ప్రశాంతతను దెబ్బతీసేలా కొండపై ఎవరు రాజకీయ వ్యాఖ్యలు చేసినా సహించేది లేదని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు హెచ్చరించారు. తిరుమల పవిత్ర క్షేత్రమని, ఇది రాజకీయ వేదిక అని తెలుసు. ఎవరు రాజకీయంగా తిరుమలను వేదికగా చేసుకున్నా చర్యలు తప్పవని గతంలోనే హెచ్చరించామని గుర్తు చేశారు. తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో వెనుకడుగు వేయకూడదనే మా పాలకమండలి తొలి సమావేశంలోనే ప్రత్యేక ఎజెండాగా ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నామని వివరించారు. తిరుమల కొండపై రాజకీయ వ్యాఖ్యలు చేస్తే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని తెలిసింది. ఇటీవల తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ ఈ విధంగా స్పందించారు.
తిరుమల తిరుపతి దేవస్థానంపై తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు చిచ్చు పెట్టాయి. ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో తెలంగాణ వారి పట్ల వివక్ష చూపిస్తున్నారంటూ ఆయన చేసిన ఆరోపణలను టీటీడీ తీవ్రంగా తీసుకుంది. రెండు రోజుల కిందటే శ్రీనివాస్ గౌడ్ తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారి దర్శనం విషయంలో టీటీడీ వివక్షను ప్రదర్శిస్తోందని, తెలంగాణ వారి పట్ల చిన్నచూపు చూస్తోందని. శ్రీ దర్శించుకోవడానికి వచ్చే తెలంగాణకు చెందిన సామాన్య భక్తులు, రాజకీయ నాయకులు, వ్యాపారుల పట్ల వివక్ష చూపడం, ఇది మంచి పరిణామం కాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. టీటీడీ పాలక మండలి అంటే తమకు అపారమైన గౌరవం ఉందని, శ్రీవేంకటేశ్వరుడు ఈ సమస్త ప్రపంచానికే దేవుడని, ఆయన వెలిసిన తిరుమలలో ఏపీలో ఉన్నంత మాత్రాన ఇతర ప్రాంతాల వారికి వ్యత్యాసం చూపడం సరికాదని అన్నారు. దేవుడి ముందు అందరూ సమానమేనని, తెలంగాణ- ఏపీ వారికి సమాన ప్రాధాన్యత కల్పించాలని అన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి పెట్టాలని, దీన్ని సరి చేయాలని కోరారు.
రాజకీయాలు వద్దు.. మాజీ మంత్రి పై చర్యలకు ఆదేశాలు
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యల పట్ల టీటీడీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తిరుమల కొండపై రాజకీయాలు మాట్లాడకూడదని తొలి పాలకమండలి సమావేశంలో తీర్మానం చేశామని, తెలంగాణకు చెందిన నేత దీన్ని ఉల్లంఘించినట్లుగా భావిస్తున్నామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తేల్చి చెప్పారు. తిరుమల పవిత్ర క్షేత్రమని, ఇది రాజకీయ వేదిక కాదని హితవు పలికారు. ఎవరు రాజకీయంగా తిరుమలను వేదికగా చేసుకున్నా చర్యలు తప్పవని గతంలోనే హెచ్చరించామని గుర్తు చేశారు. తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో వెనుక వేయకూడదని పాలకమండలి తొలి సమావేశంలోనే నిర్ణయించామని, దీన్ని ప్రత్యేక అజెండాగా చేర్చి మరీ ఈ నిర్ణయాలను తీసుకున్నామని, తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో రాజీపడబోమని బీఆర్ నాయుడు అన్నారు. తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు చేసేవాళ్లు ఎంతటివారైనా సరే ఉపేక్షించేది లేదని అన్నారు. తెలంగాణకు చెందిన బీఆర్‌ఎస్ నేత శ్రీనివాస్‌గౌడ్ తిరుమల వేదికగా రాజకీయ వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా తీసుకున్నామని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తున్నామని బీఆర్ నాయుడు పేర్కొన్నారు.