- ఫార్ములా ఈ రేసుకు డబ్బుల చెల్లింపులో కేబినెట్ ఆమోదం తీసుకున్నారా?
- గవర్నర్ క్లియరెన్స్ ఇచ్చిన కేసుపై సభలో చర్చ అవసరం లేదు
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఫార్ములా ఈ రేస్‌లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేటీఆర్ జైలుకు యోగా చేసుకోవాలని రాష్ట్ర మంత్రి సీతక్క చురకలంటించారు. ఇదే వ్యవహారంలో జైలుకు వెళ్లి యోగా చేస్తానని గతంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆమె గుర్తు చేశారు. శుక్రవారం అసెంబ్లీలో మీడియాతో చిట్ చాట్ చేసిన సీతక్క.. కేబినెట్ ఆమోదం తీసుకొని ఫార్ములా ఈ రేసుకు కేటీఆర్ డబ్బులు చెల్లించారా? అని ప్రశ్నించారు. పార్లమెంట్ లో అంబేడ్కర్ ను, అసెంబ్లీలో దళిత స్పీకర్ ను అవమానించారని బీజేపీ, బీఆర్ ఎస్ పార్టీలపై మండిపడ్డారు. ప్రభుత్వం అనుమతి లేని అంశానికి సభలో చర్చ ఎందుకు? అని ప్రశ్నించిన మంత్రి గవర్నర్ క్లియరెన్స్ ఇచ్చిన కేసుపై సభలో చర్చ అవసరం.
బీఏసీ లో ఈ ఫార్ములా మీద చర్చ కోసం బీఆర్ఎస్ ఎందుకు అడగలేదని నిలదీశారు. బీఆర్ఎస్ ముసుగు వేసుకుని రాజకీయం చేస్తుందని. తప్పు లేకపోతే విచారణ ఎదుర్కొని నిర్దోషిగా బయటికి రావచ్చు కదా? అని ప్రశ్నించారు. కేటీఆర్ తన సమస్యను రాష్ట్ర ప్రజల గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్న సమస్య. గతంలో ప్రభుత్వ కేసులు ఎదుర్కొన్న నాయకులు కోర్టుకు వెళితే పట్టిన కేటీఆర్..ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చిందనీ అసలు ఆయనకు నిజాయితీ లేదని. లక్షలాది మంది రైతుల ప్రయోజనం చేకూర్చే భూభారతి బిల్లుపై చర్చ జరగకుండా అడ్డుకునే కుట్ర చేస్తున్నారన్న మంత్రి..వాళ్ల భూకబ్జాలో బాగోతం బయటపడుతుందని సభను పట్టుకునే ప్రయత్నంలో ఉంది. అందరూ చట్టం ముందు సమానులే.. ఫార్ములా ఈ కేసులో విచారణ చేయాల్సిందేనని సీతక్క స్పష్టం చేశారు.