- 10 రోజుల పాటు అరెస్ట్ వద్దన్న న్యాయస్థానం
- అప్పటిలోగా ఎఫ్‌ఐఆర్‌పై కౌంటర్ దాఖలు చేయాలంటూ ఏసీబీకి ఆదేశాలు
- ఈ నెల 30 వరకు అరెస్ట్ చేయబడ్డ హైకోర్టు
- 14 నెలల తర్వాత కేసు నమోదు చేశారు
- రాజకీయ కక్షతోనే కేసు
- కోర్టులో వాదనలు వినిపించిన కేటీఆర్ తరపు న్యాయవాదులు
ముద్ర, తెలంగాణ బ్యూరో :- హైకోర్టులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఊరట లభించింది. 10 రోజుల వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే ఈ నెల 30లోపు దాఖలు చేయడానికి ప్రభుత్వ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను డిసెంబర్ 27వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు. అయితే ఈ కేసులో దర్యాప్తు జరగాల్సిందే అని హైకోర్టు తేల్చి చెప్పింది.
ఫూఫార్మా ఈ -రేస్‌లో తనపై వేసిన కేసును క్వాష్ చేయాలంటూ కేటీఆర్ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు సాగాయి. కేటీఆర్ తరపున సుప్రీంకోర్టు అడ్వకేట్ సుందరం వాదనలు వినిపించారు. కేటీఆర్‌పై పెట్టిన పీసీ యాక్ట్ వర్తించదన్నారు. కేటీఆర్ లబ్ధి పొందినట్లు ఎఫ్‌ఐఆర్‌లో ఎక్కడా అందించారు. అగ్రిమెంట్ జరిగిన 14 నెలల తరువాత కేసు పెట్టారని కోర్టుకు తెలిపింది. ఎన్నికల నిబంధన ఉల్లంఘన జరిగితే ఎన్నికల కమిషన్ పరిశీలించాలి… కానీ ఏసీబీకి ఏం సంబంధమని ప్రశ్నించారు.
కాగా ప్రభుత్వం తరుపున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఎఫ్‌ఐఆర్‌లో అన్ని విషయాలు పొందుపరచడం కష్టమంటూ కోర్టుకు తెలిపారు. విచారణ మొదలుకాకుండానే కేటీఆర్ క్వాష్ పిటిషన్ వేశారు. ఇరువురి వాదనలతో హైకోర్టు వారం రోజుల పాటు ఊరటనిస్తూ తీర్పు వెలువరించారు. 10 రోజుల వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు అనుమతి. డిసెంబర్ 30
రాజకీయ కక్షతోనే
కేటీఆర్ న్యాయవాది సుందరం తన వాదనలు కోర్టులో బలంగానే వినిపించారు. కేటీఆర్ లబ్ధి పొందినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పొందుపర్చలేదని, రాజకీయ కక్షతోనే కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సీజన్ 9లో అగ్రిమెంట్ జరిగింది. సీజన్ 10కి అగ్రిమెంట్ అవసరం. అగ్రిమెంట్ జరిగిన 14 నెలలకు కేసు పెట్టారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఏసీబీకి ఏం సంబంధం. కోడ్ ఉల్లంఘన జరిగితే ఈసీ చూస్తుంది. రేసు కోసం నిర్వాహకులకు నిధులు చెల్లిస్తే కేటీఆర్‌పై కేసు ఎందుకు పెట్టారు. అసలు కేటీఆర్ ఎక్కడ లబ్ధి పొందారని ప్రశ్నించారు. ఇక సీజీన్ 9 కార్ రెసింగ్ జరిగింది.
ఈ కార్ రేసింగ్ 2022 అక్టోబర్ 25లోనే ఒప్పందం జరిగింది. ఫార్ములా ఈ ఆపరేషన్స్ తో ఒప్పందం జరిగింది. సీజన్ 9లో రూ.110 కోట్ల లాభం వచ్చింది. సీసన్ 10 కోసం ఓ సంస్థ తప్పుకుంది. దీనితో ప్రభుత్వం ప్రమోటర్‌గా ఒప్పందం కుదుర్చుకుంది. పాత ఒప్పందానికి కొనసాగింపుగా కొత్త ఒప్పందం జరిగింది. ఎన్నికల కోడ్ ఉల్లగించటానికి ఎలాంటి అధారాలు లేవు. ప్రొసీజర్ పాటించలేదు అనడం సరైంది కాదు. 14 నెలల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కనీసం ప్రాథమిక విచారణ కూడా చేయకుండా కేవలం రాజకీయ కక్ష్యాలతోనే ఈ కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఎన్నో తప్పులు కనిపిస్తున్నాయి. అవినీతి నిరోధక చట్టంలోని 13(1)(ఎ) సెక్షన్ దీనికి వర్తించదని లాయర్ సుందరం వాదనలు వినిపించాయి.