Home తాజా వార్తలు కేటీఆర్ పై కేసు నమోదు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana

కేటీఆర్ పై కేసు నమోదు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana

by Prajapalana
0 comments
కేటీఆర్ పై కేసు నమోదు - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • ఫార్ములా-ఈ కారు రేస్ వ్యవహారంలో ప్రభుత్వం చర్యలు
  • నాలుగు నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన ఏసీబీ
  • హెచ్ఎండీఏ చెల్లించిన రూ.43 కోట్లు పౌండ్లుగా మార్చి ఎఫ్‌ఈఓ ధారాదత్తం
  • ఏసీబీకి పురపాలక శాఖ నివేదిక
  • మున్సిపల్ శాఖ నివేదికతో రంగంలో ఏసీబీ
  • ఈ అవినీతి వ్యవహారంలో ఆచితూచి అడుగులేసిన సర్కార్
  • ఎఫ్ఐఆర్ నమోదు కోసం సర్కార్ గవర్నర్ కు లేఖ
  • న్యాయసలహా కోరిన గవర్నర్, ఇటీవల గ్రీన్ సిగ్నల్
  • కేసు నమోదు చేసిన ఏసీబీ
  • మాజీ మంత్రితో పాటు ఇద్దరు అధికారుల మీద కేసు

ముద్ర, తెలంగాణ బ్యూరో :- రాష్ట్ర రాజకీయాల్లో అతి పెద్ద సంచలనం. కొద్ది రోజులుగా రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతున్న విధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదైంది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారంటూ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కింద ఆయన మీద ఏసీబీ గురువారం కేసు నమోదు చేసింది. 13(1)ఎ, 13(2) పీసీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసింది. వాటితో పాటు 409, 120B సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. మొత్తంగా నాలుగు సెక్షన్ల కింద కేటీఆర్‌పై ఏసీబీ కేసులు నమోదు చేసింది. ఈ-రేసింగ్ కేసులో.. ఎ1గా కేటీఆర్, ఎ2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఎ3గా హెచ్‌ఎండీఏ చీఫ్ ఇండనీర్ బీఎల్‌ఎస్ రెడ్డిగా ఏసీబీఫార్మ్ చేశారు.

ఈ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ ప్రధాన నిందితుడు.. సెక్షన్ 17A ప్రకారం గవర్నర్ అనుమతి తప్పని సరి అయింది. మంత్రిగా విధి నిర్వహణ సమయంలో వచ్చిన ఆరోపణలు కాబట్టి గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ లోనే ఏసీబీ గవర్నర్ కు అనుమతి కోసం పంపింది. న్యాయసలహా తీసుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ఇటీవల అనుమతి ఇచ్చారు. గవర్నర్ నుంచి అనుమతి ఇచ్చిన ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని సీఈఎస్ శాంతి కుమారి ఏసీబీకి లేఖ రాశారు. ఫార్మాలా ఈ కార్ రేసు పూర్వాపరాలు, అనుమతి లేకుండానే హెచ్‌ఎండీఏ ఒప్పందం చేసుకోవడం, ఆర్బీఐ అనుమతి లేకుండా రూ. 46 కోట్ల మేర విదేశీ కరెన్సీ చెల్లించడం వంటి వ్యవహారాలపై పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు కేటీఆర్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేబినెట్ అనుమతి, ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండానే ఈ వ్యవహారంలో నిధులు చెల్లించినట్లు కేటీఆర్‌పై అభియోగాలు మోపారు. కేటీఆర్‌తోనే అధికార దుర్వినియోగానికి కారణమని ఏసీబీ అభియోగాలు మోపింది.

ఇదే కావాలంటే నాంపల్లి ఏసీబీ కోర్టుకు అధికారులు ఎఫ్‌ఐఆర్ కాపీని సమర్పించారు. మాజీ మంత్రి కేటీఆర్ మీద పీసీ యాక్టు కింద కేసు నమోదు చేసినట్టు కోర్టుకు ఏసీబీ అధికారులు తెలిపారు. ఆర్బీఐ నిబంధనలకు విరుద్దంగా ఓ విదేశీ సంస్థకు నిధుల బదలాయింపు జరిగిందన్నది ప్రధాన అభియోగం కాగా.. అధికార దుర్వినియోగం చేశారన్నది మరో అభియోగం. కేబినెట్ ఆమోదం లేకుండా మంత్రిగా ఉన్న కేటీఆర్ తన సొంత నిర్ణయంతో హెచ్ఎండీఏ బోర్డు నుంచి విదేశీ కంపెనీకి నిధులు బదలాయించినట్టు తెలుస్తోంది. కేటీఆర్‌తోనే.. డబ్బులు చెల్లించినట్లుగా హెచ్‌ఎండీఏ అధికారులు కూడా ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే. ఆర్బీఐఐ అనుమతి లేకుండా ఓ విదేశీ సంస్థకు కరెన్సీ రూపంలో డబ్బు చెల్లించనట్టయితే.. రూ.8 కోట్ల పెనాల్టీ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే.. ఆర్బీఐ ఈ పెనాల్టీ వేయటంతో.. ఈ రేసుకు సంబంధించిన మొత్తం వ్యవహారం బట్టబయలైంది. కాగా కేటీఆర్ మీద నమోదు చేసిన 13(1)ఏ.. ఉద్ధేశ్యపూర్వకంగా నేరపూరితమైన చర్యలకు ఈ సెక్షన్ చెప్తోంది. ప్రభుత్వ ప్రతినిధి అధికార దుర్వినియోగానికి పాల్పడితే అమలయ్యే 13 (2) పీసీ యాక్ట్ కింద నమోదు చేసిన విషయం తెలిసిందే. ఒకవేళ నేరం రుజువైతే.. ఏడాది నుంచి గరిష్ఠంగా ఏడేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. నేరపూరిత విశ్వాస ఉల్లంఘన కింద 409 సెక్షన్, ఒప్పందంలో కుట్రపూరితంగా వ్యవహరించటానికి సంబంధించి 120B కింద కూడా కేసులు నమోదు చేయబడ్డాయి.

అరెస్టా లేక నోటీసులు జారీ చేస్తారా

ప్రస్తుతం కేటీఆర్ ను అరెస్టు చేస్తారా లేకపోతే నోటీసులు జారీ చేసి ప్రశ్నిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఫార్ములా ఈ రేసుకు సంబంధించి అప్పటి ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు ఆదేశిస్తేనే విదేశీ సంస్థలకు నిధులు విడుదల చేశామని ఇప్పటికే అధికారులు గుర్తించారు. మున్సిపల్ శాఖ ఉన్నతాధికారిగా పని చేసిన అర్వింద్ కుమార్ కేటీఆర్ నోటి మాట ద్వారా నిధులు ఇచ్చామని చెప్పారు. ఆ నివేదికల్ని కూడా ఏసీబీ కూడా పొందుపరిచింది. ఇది పూర్తిగా నిధుల స్వాహా అనే అభిప్రాయం కల్పిస్తోంది అందుకే ఏసీబీ కేసు నమోదు చేసింది. సీరియస్ నేరం కావడం పక్కాగా సాక్ష్యాలు ఉండటంతో విచారణకు పిలిచి అరెస్టులు చేసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.

ఇదిలా ఉండగా ఆయన అరెస్ట్ కు రంగం సిద్ధం కావడానికి వార్తలు వస్తున్నాయి. తెలంగాణ భవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది.ఈ నేపథ్యంలో ఏ క్షణమైనా కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారన్న ప్రచారం మరింత ఊపందుకుంది.ఇందులో భాగంగానే బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయమైన హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. గురువారం మధ్యాహ్నం తర్వాత అక్కడికి భారీగా పోలీసులు బలగాలను నిర్వహించారు.

న్యాయపరమైన చిక్కులు రాకుండా ప్లాన్ ..

కాగా, హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఈడీ ఏసీబీ ఆఫీస్ కేంద్రంగా డైరెక్టర్ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్(సీఐయూ) ఆధ్వర్యంలో ఈ కేసును దర్యాప్తు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏసీబీ బృందం సమావేశం నిర్వహించి అరెస్టుకు సంబంధించిన ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. ఇక విచారణ సమయంలో న్యాయపరమైన చిక్కులు రాకుండా లీగల్ ఒపీనియన్ తీసుకుందని, హైప్రొఫైల్ కేసు వివరాలను రహస్యంగా ఉంచుతున్నట్లు వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. నోటీసులు ఇవ్వగానే సహా మిగిలిన వాళ్లను హెడ్ క్వార్టర్స్‌లోనే ప్రశ్నించేందుకు కేటీఆర్ రంగం సిద్ధం చేసిన ఏసీబీ.. దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది.

అక్రమంగా రూ.55 కోట్లు..

ఈ ఫార్ములా–ఈ రేస్ కార్ల ఇష్యూలో విదేశీ సంస్థలకు రూ.55 కోట్లు అక్రమంగా చెల్లించారని ఆరోపణలు ఉన్నాయి. అప్పటి మున్సిపల్ శాఖ సెక్రటరీ అర్బన్ కుమార్‌కు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఈ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే తాను చెల్లింపులు చేసినట్టు అరవింద్ బయటపెట్టారు. విదేశాల్లో ఉన్న కంపెనీకి ఆర్బీఐతో పాటు ఇతరత్రా ఎలాంటి పర్మిషన్లు లేకుండానే చెల్లింపులు జరిగాయి. సీజన్ 10 విషయంలో నిబంధనలు పాటించలేదని, నిధులు పంపిన 18 రోజులకు ఎన్నికల కోడ్ టైంలో ఒప్పందం చేసుకున్నట్లు. ఈసీ నుంచి ఎలాంటి పర్మిషన్లు తీసుకోలేదని హెచ్ఎండీఏపై రూ.200 కోట్ల భారం పడిందని చెప్పారు.

మొత్తం రూ.200 కోట్లు

ఇక 2023 ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లో ఫార్ములా–ఈ కార్ రేస్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగింది. మొత్తం రూ.200 కోట్లు ఖర్చు చేశారు. ఈవెంట్ నిర్వాహక సంస్థలైన గ్రీన్ కో రూ.150 కోట్లు, హైదరాబాద్ రేసింగ్ లిమిటెడ్ రూ.30 కోట్లు ఖర్చు చేశాయి. హెచ్ఎండీఏ రూ.20 కోట్లు ఖర్చు చేసింది. సీజన్ 9 విజయవంతంగా సీజన్ 10 నిర్వహించేందుకు ఫార్ములా–ఈ ఆపరేషన్ (ఎఫ్ఈవో)తో మున్సిపల్ శాఖ 2023 అక్టోబర్‌లో అగ్రిమెంట్ కుదుర్చుకోగా అగ్రిమెంట్‌కు ముందే ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే రూ.55 కోట్లకు ఎండీఏ చెల్లించడం వివాదాస్పదమైంది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech