Home సినిమా 'బచ్చలమల్లి' మూవీ రివ్యూ – Prajapalana News

'బచ్చలమల్లి' మూవీ రివ్యూ – Prajapalana News

by Prajapalana
0 comments
'బచ్చలమల్లి' మూవీ రివ్యూ


నటీనటులు : అల్లరి నరేష్‌, అమృత అయ్యర్‌, రావు రమేష్‌, సాయికుమార్‌, హరితేజ, రోహిణి తీసుకున్నారు.
సంగీతం: విశాల్‌ చంద్రశేఖర్‌
సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ఎం.నాథన్
ఎడిటింగ్: ఛోటా కె. ప్రసాద్
నిర్మాతలు: రాజేష్‌ దండా, బాలాజీ గుత్తా
బ్యానర్: హాస్య మూవీస్
రచన, దర్శకత్వం: సుబ్బు మంగాదేవి
విడుదల తేదీ: 20.12.2024

తన అల్లరితో మొదటి విజయాన్ని అందుకున్న నరేష్ ఆ సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్నారు. ఆ తర్వాత కామెడీ హీరోగా తనకంటూ ఓ స్టైల్‌ని క్రియేట్‌ చేసి ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తారు. అతని సినిమాలను ప్రేక్షకులు మొనాటనీ ఫీల్‌ అవుతుండడంతో తన ట్రాక్‌ మార్చాడు. కామెడీని పక్కన పెట్టి ప్రయోగాత్మక సినిమాలపై దృష్టి పెట్టాడు. ఆ విధంగా కొంత సక్సెస్ సాధించాడు. అయితే ప్రతి సినిమాలోనూ తనను కొత్తగా ప్రజెంట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా 'బచ్చలమల్లి' చిత్రంలో మరో కొత్త క్యారెక్టర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా నరేష్‌కి ఎలాంటి ఫలితాన్ని ఇచ్చింది? ప్రేక్షకులు ఈ సినిమా ఎంతవరకు ఆదరించే అవకాశం ఉందా? సినిమాలోని ప్లస్‌లు, మైన్స్‌లు ఏమిటి? అనే విషయాలను సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ:

సాదా సీదాగా సాగిపోతున్న బచ్చలమల్లి(నరేష్) జీవితంలో జరిగిన ఓ ఘటన అతన్ని పూర్తిగా మార్చేస్తుంది. తన తండ్రి రెండో పెళ్లి చేసుకుంటాడు. ఆ విధంగా తన తల్లికి తండ్రి అన్యాయం చేశాడని అతనిపై ద్వేషం పెంచుకుంటాడు. అది పగగా మారుతుంది. దీనితో చదువు మానేస్తాడు. అన్నిరకాల వ్యసనాలకు బానిసవుతాడు. మందు, సిగరెట్ వంటి దురలవాట్ల వల్ల జీవితం పక్కదారి పడుతుంది. వీటన్నింటి వల్ల అతనిలో మానవత్వం కంటే మూర్ఖత్వం పెరిగిపోతుంది. అల్లరి చిల్లరగా తిరుగుతున్న అతనికి కావేరి(అమృత అయ్యర్‌) తారసపడుతుంది. ఆమెను ప్రేమిస్తాడు. ఆమె కోసం వ్యసనాల పక్కన పెట్టేస్తాడు. మల్లి జీవితం ఒక దారికి వస్తుందనుకుంటున్న తరుణంలో అతనిలోని రాక్షసుడు, అతని మూర్ఖత్వం ఒక్కసారిగా బయటికి వస్తుంది. తనను తాను మార్చుకొని మంచి జీవితంలోకి వెళ్ళబోతున్న మల్లి అలా మారడానికి కారణాలు ఏమిటి? కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్న మల్లి మళ్ళీ పాతరోజుల్లోకి వెళ్లిపోయాడా? తర్వాత ఏం జరిగింది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ :

సినిమా అంటే ఒక కథ, దానికి తగ్గ కథనం, హీరో క్యారెక్టరైజేషన్, ప్రేక్షకులను థ్రిల్ చేసే ట్విస్టులు, లేదా గుండెల్ని పిండేసే ఎమోషన్స్ ఉండాలి. అప్పుడే అది పరిపూర్ణమైన సినిమా అనిపించుకుంటుంది. కానీ, బచ్చలమల్లి సినిమా విషయానికి వస్తే అవన్నీ వదిలేసి కేవలం హీరో క్యారెక్టరైజేషన్‌ మీదే కాన్‌సన్‌ట్రేట్‌ చేశాడు దర్శకుడు సుబ్బు. ప్రతి సన్నివేశంలోనూ హీరో క్యారెక్టరైజేషనే కనిపిస్తుంది. దాంతో కథపై పట్టు సడలిపోయింది. హీరో కోపం, పంతం, మూర్ఖత్వం ప్రతి సీన్‌లోనూ కనిపిస్తుంది. అన్నీ జరుగుతున్న టైమ్‌లో స్టార్ట్ అయ్యే లవ్ ట్రాక్‌ కూడా చాలా సాదా సీదాగా ఉంటుంది. ప్రతి సినిమాలో మాదిరిగానే ఇందులోనూ హీరోయిన్‌ చిల్లరగాడ్ని ప్రేమించిందేమిటి? అనిపిస్తుంది. మూర్ఖంగా ఉంటే మల్లి.. ఒక అమ్మాయి రావడంతో ఒక్కసారిగా మారిపోవడం సహజంగా అనిపించదు. ఆ తర్వాత తల్లి చెప్పే మాటలతో మరింత మారిపోతాడు. తల్లి చెప్పే మాటలు క్లైమాక్స్‌లో ఉంటాయి. ఆ తల్లి కొడుక్కి చేసే హితబోధ ప్రారంభంలోనే చేస్తే ఇంత కథ ఉండదు కదా అనిపిస్తుంది. తండ్రి క్యారెక్టర్ ఎంతో సాఫ్ట్‌గా ఉంటుంది. అతనిపై హీరో పగ పెంచుకోవడం అనేది అసహజంగా అనిపిస్తుంది. ఇక సినిమాలో విలన్ క్యారెక్టర్ ఎందుకు పెట్టారో అర్థం కాదు. హీరో ఉన్నప్పుడు విలన్ కూడా ఉండాలి అని క్యారెక్టర్ పెట్టినట్టు అనిపిస్తుంది తప్ప ఉపయోగం కనిపించదు. ఒక దశలో హీరో మూర్ఖత్వాన్ని మరీ పీక్స్‌లో చూపించారు. దాంతో హీరో పట్ల ఎవరికీ సానుభూతి కలగకపోగా కోపం వస్తుంది. సినిమాని ఒక బలమైన ఎమోషన్‌తో ముగించినా అది ఆడియన్స్‌కి కనెక్ట్ అవ్వలేదనే చెప్పాలి.

నటీనటులు :
బచ్చలమల్లి క్యారెక్టర్‌కి నరేష్‌ జీవం పోశాడని చెప్పొచ్చు. కామెడీని పక్కన పెట్టి ఈ తరహా క్యారెక్టర్లు గతంలో కూడా నరేష్ చేశాడు. కానీ, ఈ సినిమా మాత్రం అతనికి ప్రత్యేకం అని చెప్పొచ్చు. అతని కెరీర్‌లో ఒన్‌ ఆఫ్‌ ద బెస్ట్‌ క్యారెక్టర్స్‌ అని చెప్పొచ్చు. ఇక హీరోయిన్‌ అమృత అయ్యర్‌ ఎంతో సంప్రదాయబద్దంగా కనిపించి ఆకట్టుకుంది. రావు రమేష్‌ షరా మామూలే అనే క్యారెక్టర్ చేశాడు. ప్రవీణ్‌కి చాలా కాలం తర్వాత మంచి గుర్తింపు తెచ్చే క్యారెక్టర్ వచ్చింది. ఇక ప్రసాద్ బెహరా, వైవా హర్ష తమ పంచులతో నవ్వించారు.

నిపుణులు సాంకేతిక:

సాధారణంగా నరేష్‌ సినిమాల్లో టెక్నికల్‌ స్టాండర్డ్స్‌ హై రేంజ్‌లో ఉండవు. ఎందుకంటే గతంలో చేసిన సినిమాలన్నీ కామెడీ బేస్డ్ కాబట్టి ఆ అవసరం రాలేదు. కానీ, ఈ సినిమా టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో ఉంది. దాని కోసం బడ్జెట్‌ బాగానే పెట్టారనిపిస్తుంది. సినిమాలోని పాటలు బాగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఆకట్టుకుంటాయి. ఎడిటింగ్ కూడా బాగానే ఉంది. టోటల్‌గా ప్రొడక్షన్‌ వేల్యూస్‌ బాగా ఉన్నాయి.

ఫైనల్‌గా చెప్పాలంటే..

సాధారణ సినిమాలను చూసి బోర్ కొట్టిన ఆడియన్స్‌ ఈ సినిమా కొత్తగా ఫీల్‌ అయ్యే అవకాశం ఉంది.

రేటింగ్: 2.5/5


You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech