దిల్ రాజు ప్రొడక్షన్ లో వేణు దర్శకత్వంలో తెరకెక్కిన బలగం మూవీ ఘన విజయం అందుకుంది. తెలంగాణ ప్రజల జీవనాన్ని ప్రపంచానికి చెప్పిన ఈ చిత్రం సమాజానికి ఒక సోషల్ మెసేజ్ ని కూడా ఇచ్చి విడిపోయిన అన్నదమ్ముల్ని కూడా కలిపిందంటే బలం యొక్క ప్రభావం అర్ధం చేసుకోవచ్చు.ఇప్పుడు ఈ చిత్ర యూనిట్ తో పాటు తెలుగు ప్రజలందరిలో విషాద ఛాయలు నింపే సంఘటన చోటు చేసుకుంది.
బలగం క్లైమాక్స్ లో భావోద్వేగభరితమైన పాటను ఆలపించిన ప్రముఖ జానపద కళాకారుడు మొగిలయ్య ఈరోజు తెల్లవారు జామున మరణించడం జరిగింది. కొంత కాలంగా మొగిలయ్య కిడ్నీ సంబంధిత వ్యాధితోపాటు హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. ఇప్పటికే ఆయనకు తెలంగాణ ప్రభుత్వం చికిత్స అందించింది. హైదరాబాద్ మెరుగైన వైద్య సౌకర్యాన్ని కూడా కల్పించారు. ఆతర్వాత బలం సినిమా డైరెక్టర్ వేణుతోపాటు, మెగాస్టార్ చిరంజీవి కూడా ఆయనకు ఆర్థిక సాయం చేశారు. కానీ మళ్లీ కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలు తలెత్తడంతో తుది శ్వాస విడిచారు.పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలియచేస్తున్నారు.