సాధారణంగా హీరోయిన్ల పెళ్లిళ్లు మొదట లవ్ అనే రూమర్‌తో మొదలవుతాయి. అలా కొన్నాళ్ళు ప్రచారం జరిగిన తర్వాత ఓ శుభముహూర్తాన తాము పెళ్లిబోతున్నామంటూ ఆ జంట కనిపిస్తుంది. కానీ, ఇక్కడ అలాంటి రూమర్ లేదు, గాసిప్ లేదు. డైరెక్ట్‌గా పెళ్ళే. మహానటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ తన పెళ్లి విషయంలో ఎలాంటి న్యూస్ బయటికి రాకుండా ఎంతో సస్పెన్స్ మెయిన్‌టెయిన్ చేసింది. చివరి క్షణంలో తన క్లాస్ మేట్ ఆంటోనిని వివాహం చేసుకోబోతున్నట్టు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. పది రోజుల ముందే తన వివాహ నిర్ణయించబడింది.
గురువారం గోవా వేదికగా కీర్తి సురేష్, ఆంటోని తట్టిల్‌ల వివాహం హిందూ సంప్రదాయ పద్ధతిలో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి ఇరు కుటుంబ సభ్యులు, కొందరు సన్నిహిత మిత్రులు మాత్రమే. ఇక సౌత్ చిత్ర పరిశ్రమల్లోని ప్రముఖులు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. తన పెళ్లికి సంబంధించిన విషయం కూడా కీర్తి సురేషే సోషల్ మీడియాలో షేర్ చేసింది. మూగ జీవితాలను ఎక్కువగా ఇష్టపడే కీర్తి తన పెళ్లి ఫోటోల్లో ఒక కుక్క పిల్లకు కూడా చోటిచ్చింది. హిందూ సంప్రదాయం తర్వాత క్రైస్తవ సంప్రదాయ పద్ధతిలో కూడా వీరిద్దరూ వివాహం చేసుకోవాల్సి ఉంది. అది గురువారం సాయంత్రం ఓ చర్చిలో జరిపేందుకు పెద్దలు నిర్ణయించారట. దానికి సంబంధించిన ఫోటోలు కూడా త్వరలోనే సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి.