“పుష్ప అంటే ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్” అని ఏ ముహూర్తాన డైలాగ్ రాశారో కానీ, ఆ డైలాగ్ కి తగ్గట్టుగానే 'పుష్ప-2' చిత్రం బాక్సాఫీస్ దగ్గర వైల్డ్ గా దూసుకుపోతూ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. రోజురోజుకి ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంటూ, చరిత్ర సృష్టిస్తోంది. (పుష్ప 2 రూల్)
భారత సినీ చరిత్రలో ఇప్పటిదాకా రూ.1000 కోట్ల గ్రాస్ క్లబ్‌లో చేరిన సినిమాలు ఏడు ఉండగా.. కేవలం ఆరు రోజుల్లో రూ.1000 కోట్ల గ్రాస్ రాబట్టి 'పుష్ప-2' సరికొత్త అధ్యాయాన్ని సృష్టించింది. ఈ ఘనత సాధించడానికి 'బాహుబలి-2'కి 10 రోజులు, 'కల్కి'కి 15 రోజులు, 'ఆర్ఆర్ఆర్', 'కేజీఎఫ్-2' చిత్రాలకు 16 రోజులు పడితే.. 'పుష్ప-2' కేవలం ఆరు రోజుల్లోనే 1000 కోట్లతో బాక్సాఫీస్ ఊచకోత అంటే ఏంటో చూపించింది. .
మొదటి రోజు నుంచే పుష్ప-2 సినిమా ఇలా ఎన్నో రికార్డులను తిరగరాస్తోంది. ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా రూ.294 కోట్ల గ్రాస్ రాబట్టి ఇండియన్ సినిమా చరిత్రలో ఆల్ టైం రికార్డుని ఖాతాలో వేసుకుంది. వరల్డ్ వైడ్ గానే కాకుండా, ఏరియాల వారి గానూ పలు రికార్డులు సృష్టించాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైం డే-1 రికార్డ్ నమోదు చేసింది. హిందీ బెల్ట్‌లో ఇప్పటివరకు ఉన్న షారుఖ్ ఖాన్ 'జవాన్' రికార్డును బ్రేక్ చేస్తూ ఏకంగా రూ.72 కోట్లతో హైయెస్ట్ డే-1 రికార్డ్ క్రియేట్ చేసింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఆల్ టైం హైయెస్ట్ డబ్బింగ్ సినిమా డే-1 రికార్డ్ లు 'పుష్ప-2' ఖాతాలో చేరాయి. కేరళలో గతంలో ఒక తెలుగు సినిమాకు ఎన్నడూ లేని విధంగా డే-1 రికార్డు నమోదైంది. అలాగే మూడు రాష్ట్రాల్లో ఆల్ టైం టాప్-2 గా నిలవడమే కాకుండా, దాదాపు 20 రాష్ట్రాల్లో కలెక్షన్లు రాబట్టింది.
సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, ఓవర్సీస్ అనే తేడా లేకుండా.. ప్రతి చోటా, ప్రతి రోజూ సంచలన వసూళ్లతో రికార్డులు సృష్టిస్తోంది పుష్ప-2. హిందీ బెల్ట్ లో ఒక్కరోజులో 50 కోట్లు వసూలు చేయడమే కష్టం, కానీ అల్లు అర్జున్ 'పుష్ప 2' నాలుగో రోజు ఏకంగా 86 కోట్లు నెట్ వసూలు చేసింది. ఇప్పటిదాకా హిందీలో ఒకేరోజు 70 కోట్ల కలెక్షన్స్ చేసిన సినిమానే లేని పరిస్థితుల్లో నెట్ పుష్ప-2 నాలుగు రోజుల్లో ఏకంగా మూడు సార్లు ఈ ఫీట్. హిందీలో అతివేగంగా రూ.200, రూ.300 కోట్లు వసూలు చేసి సినిమాగానూ కోట్లు సంపాదించింది. జవాన్ సినిమాకి హిందీలో 300 కోట్ల వసూళ్లకు 6 రోజులు పట్టగా.. పుష్ప-2 కేవలం 5 రోజుల్లోనే ఆ రికార్డును నమోదు చేసింది. 'ఆర్ఆర్ఆర్', 'కల్కి', 'సలార్' వంటి చిత్రాల హిందీ లైఫ్ టైం కలెక్షన్లను.. 'పుష్ప 2' కేవలం ఒక్క వీకెండ్ లోనే కలెక్ట్ చేసి చూపించింది.
తమిళనాడులో ఫస్ట్ వీకెండ్ టాప్ గ్రాసర్స్ గా 'బాహుబలి-2', 'ఆర్ఆర్ఆర్' ఉండగా.. ఇప్పుడు ఆ రికార్డును 'పుష్ప-2' సొంతం చేసుకుంది. ఓ డబ్బింగ్ చిత్రం అక్కడ మూడు రోజులపాటు వరుసగా డబుల్ డిజిట్ వసూలు చేయడం ఇదే తొలిసారి. అలాగే కర్ణాటకలో వేగంగా 50 కోట్ల మార్కును అందుకుంది. గుజరాత్ లో సింగల్ డే రికార్డును హైయెస్ట్.
ఆస్ట్రేలియాలో ఇప్పటివరకు ఫస్ట్ వీకెండ్ హైయెస్ట్ ఇండియన్ సినిమా రికార్డు 'పఠాన్' సొంతం కాగా, 'పుష్ప 2' చిత్రం 2.32 ఆస్ట్రేలియన్ డాలర్స్ తో ఆ రికార్డును బ్రేక్ చేసి, కొత్త రికార్డు సృష్టించింది. న్యూజిలాండ్‌లోని సౌత్ ఇండియన్ సినిమా ఇంతవరకు ఎప్పుడూ కలెక్ట్ చేయనంత వీకెండ్ కలెక్షన్లను 'పుష్ప 2' కలెక్ట్ చేసింది.
మొదటి నాలుగు రోజులు, ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ రూ.100 కోట్లకు తగ్గకుండా వసూలు చేసిన పుష్ప-2.. ఫస్ట్ వీకెండ్ లోనే ఏకంగా రూ.829 కోట్లు కలెక్ట్ చేసింది. వీక్ డేస్ లోనూ అదే జోరుని ప్రదర్శిస్తూ.. కేవలం ఆరు రోజుల్లోనే రూ.1000 కోట్ల క్లబ్ లో చేరింది. రోజులు గడిచే కొద్దీ సరికొత్త రికార్డులు పుష్ప-2 ఒడిని చేరుతున్నాయి. ఆల్ టైం ఇండియన్ డే1 రికార్డ్, ఆల్ టైం ఫస్ట్ వీకెండ్ రికార్డ్, ఆల్ టైం ఫస్ట్ వీక్ రికార్డు ఇప్పుడు 'పుష్ప 2' చేతిలో ఉన్నాయి.
ఆన్ లైన్ టికెట్ బుకింగ్ పరంగానూ 'పుష్ప-2' చరిత్ర సృష్టించింది. గంటకు లక్ష టికెట్లు బుక్ అయిన రికార్డుతో పాటు 24 గంటల్లో 10 లక్షల టికెట్లు బుక్ అయిన రికార్డును కూడా ఈ చిత్రం గుర్తించింది.