మోహన్ బాబు(mohan babu)నిన్న జల్లేపల్లి లోని తన ఇంటి దగ్గరకి వచ్చిన మీడియా వాళ్ళతో కలిసి ప్రవర్తించడమే కాకుండా ఒక మీడియా పర్సన్ దగ్గర మైక్ లాక్కొని అతని చెవి కొట్టడంతో ఆ జర్నలిస్ట్ ప్రస్తుతం హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు.ఈ సంఘటన తెలంగాణ జర్నలిస్ట్ ల ఫోరం మోహన్ బాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉంది.
ఇప్పుడు ఈ విషయంపై మనోజ్(మంచు మనోజ్)మీడియాతో మాట్లాడను మా నాన్న, అన్న చేసిన దానికి సారీ మీకెప్పుడు అండగా ఉంటాను, ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు అక్కడ ఉంటాను నాకు సపోర్ట్ చెయ్యడానికి వచ్చి మీకు ఇలా జరగడం చాలా బాధగా ఉంది.మా నాన్న తరుపున నేను క్షమాపణలు కోరుతున్నాను.మా నాన్న దేవుడు .ఈ రోజు ఏదైతే చూస్తున్నారో అది మా నాన్న కాదు.ఇదంతా వినయ్ వాళ్ళు చేస్తున్నారు.నేను అబద్దాలు ఆడే వాడిని కాదు.నా గురించి ఎవరినైనా అడిగితే ఈ విషయం చెప్తారు.
మా ఆవిడ తన ఇంట్లో గాని,నేను మా ఇంట్లో గాని ఎలాంటి డబ్బులు గాని ఆస్తులు గాని అడగలేదు,
పది కార్లున్న మా ఇంటికి మొన్న నైట్ 108 అంబులెన్సు మా ఇంటికి వచ్చింది.పోలీసులకి కూడా ఈ విషయం తెలుసు.ప్రతిదీ నేను అంటున్న వాళ్ళు సీసీ కెమెరాలు చెక్ చేస్తే అసలు విషయం తెలుస్తుంది.పసి పిల్ల అయిన నా కూతురు జోలికి వినయ్ అనే వాళ్ళు వచ్చారు.అప్పుడు భయపడి పోలీసులకి చెప్పాను.అసలు ఈ గొడవలన్నీ ఎందుకు వచ్చాయో ఈ రోజు ఈవినింగ్ ప్రెస్ మీట్ పెట్టి మొత్తం మాట్లాడతానని చెప్పుకొచ్చాడు.