Home సినిమా హాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సిడ్నీ స్వీనీతో సౌత్‌ హీరో భేటీ.. విషయం ఏమిటి? – Prajapalana News

హాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సిడ్నీ స్వీనీతో సౌత్‌ హీరో భేటీ.. విషయం ఏమిటి? – Prajapalana News

by Prajapalana
0 comments
హాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సిడ్నీ స్వీనీతో సౌత్‌ హీరో భేటీ.. విషయం ఏమిటి?


సిడ్నీ స్వీని.. 2009లో హాలీవుడ్‌లో ఎంటర్‌ అయిన ఈమె చాలా సినిమాల్లో తన పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది. అలాగే టెలివిజన్‌ ​​షోలు, పాడ్‌కాస్ట్‌లు, వెబ్‌ సిరీస్‌లు, మ్యూజిక్‌ వీడియోలు.. ఇలా ప్రేక్షకులకు రకరకాల ఎంటర్‌టైన్‌మెంట్‌లు అందిస్తోంది. ఇప్పుడీ బ్యూటీ ఓ తమిళ్‌ హీరోతో కలిసి నటిస్తుందన్న వార్త హల్‌చల్‌ చేస్తోంది. ఆ హీరో ఎవరో కాదు ధనుష్. ఇటీవల స్వీయ దర్శకత్వంలో నటించిన 'రాయన్‌' చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం నాగార్జునతో కలిసి 'కుబేర' చిత్రంలో నటిస్తున్నారు ధనుష్‌ ఇది కాకుండా తన దర్శకత్వంలోనే తమిళ్‌లో 'ఇడ్లీ కడాయి' పేరుతో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ధనుష్ సరసన నిత్యామీనన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.

ఇదిలా ఉంటే.. హాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సిడ్నీ స్వీనితో ధనుష్‌ టీమ్‌ చర్చలు జరుపుకుంటోంది. ధనుష్‌తో కలిసి ఈ బ్యూటీ నటించబోతోంది అనేది వార్త. ఆమెకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. వివిధ దేశాలకు సంబంధించిన మేకర్స్’ ఆమెతో సినిమాల కోసం ఆసక్తి చూపిస్తారు. అంత పాపులరిటీ వున్న హీరోయిన్‌ని ఓ తమిళ్‌ సినిమా కోసం తీసుకురావడం అంటే సాహసమనే చెప్పాలి. గతంలో ధనుష్‌ బాలీవుడ్‌ సినిమాలతోపాటు హాలీవుడ్‌ సినిమాల్లో కూడా నటించిన విషయం తెలిసిందే. అతను కీలక పాత్రలో నటించిన ది గ్రే మ్యాన్ మంచి హిట్ అయింది. అందులో ధనుష్‌ చేసిన యాక్షన్‌ సీక్వెన్స్‌లు కూడా బాగుంటాయి. ఇప్పుడు సిడ్నీతో జరుపుతున్న చర్చలు తమిళ్‌ సినిమా కోసమా లేక హాలీవుడ్‌ సినిమా కోసమా అనేది తెలియాల్సి ఉంది.

ధనుష్ చేసే సినిమాల్లోని కథ, కథనాలు అందర్నీ ఆకట్టుకునే విధంగా ఉంటాయి. ఈ విషయంలో సిడ్నీకి కూడా అవగాహన ఉందని తెలుస్తోంది. అందుకే ధనుష్ టీమ్‌తో చర్చలకు సిద్ధమైంది. ఇంతకుముందు ధనుష్‌ హాలీవుడ్‌ సినిమాల్లో నటించిన అవి అందరికీ రీచ్‌ అవ్వలేదన్న లోటు ధనుష్‌కి ఉంది. అందుకే ఈసారి హాలీవుడ్‌లో ఒక రేంజ్ సినిమా చెయ్యాలని డిసైడ్ అయినట్టు కనిపిస్తుంది. సిడ్నీతో దాని గురించిన చర్చలు జరుపుకునే సమాచారం. ఇప్పటికే తన సినిమాలతో ఇండియాలో పాపులర్‌ హీరోగా పేరు తెచ్చుకున్న ధనుష్‌ ఇప్పుడు హాలీవుడ్‌పై కన్నేశారు. దానికి తగ్గట్టుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్టు ప్రస్తుత పరిస్థితి చూస్తే అర్థమవుతోంది.


You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech