Home తాజా వార్తలు ఒక పక్క రుణమాఫీ పూర్తయింది అంటున్న ప్రభుత్వం – అన్ని అర్హతలు ఉన్న తమకు రుణమాఫీ కాలేదంటున్నపలువురు రైతులు. – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana

ఒక పక్క రుణమాఫీ పూర్తయింది అంటున్న ప్రభుత్వం – అన్ని అర్హతలు ఉన్న తమకు రుణమాఫీ కాలేదంటున్నపలువురు రైతులు. – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana

by Prajapalana
0 comments
ఒక పక్క రుణమాఫీ పూర్తయింది అంటున్న ప్రభుత్వం - అన్ని అర్హతలు ఉన్న తమకు రుణమాఫీ కాలేదంటున్నపలువురు రైతులు. - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • పలు బ్యాంకుల్లో రుణం పొందామని తమకు రుణం ఎందుకు మాఫీ కాలేదు అని ప్రశ్నిస్తున్న రైతులు.
  • 50 వేల నుండి రెండు లక్షల లోపు రుణాలు తీసుకున్న రైతుల రుణమాఫీ కాలేదా?
  • రుణమాఫీ కానీ రైతుల ప్రశ్నలకు సమాధానం దాటవేస్తున్న బ్యాంకర్లు వ్యవసాయ శాఖ అధికారులు.
  • రుణమాఫీ ఎందుకు కాలేదో స్పష్టత ఇవ్వని అధికారులు

తుంగతుర్తి ముద్ర :- ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల లోపు రుణమాఫీ పూర్తయిందని మరోపక్క తాము రెండు లక్షల లోపు రుణం తీసుకున్నామని తాము తీసుకున్న రుణాలు మాఫీ కాలేదని తుంగతుర్తి మండలంలో రైతులు ఆరోపిస్తున్నారు. తుంగతుర్తి మండలానికి చెందిన వివిధ మండలాల్లోని వివిధ బ్యాంకుల నుండి 50 లక్షల లోపు రుణాలు పొందామని అయినా తమకు వేల రుణమాఫీ ఎందుకు అర్థం కావడం లేదని అంటున్నారు. ఒకపక్క రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ పూర్తయిందని ప్రకటి నాలుగవ జాబితా విడుదల చేసిందని అందులో తమ పేర్లు ఎందుకు లేవు అర్థం కావడం లేదని రైతులంటున్నారు. తాము బ్యాంకర్ల వద్దకు వెళ్లి అడిగిన వ్యవసాయ శాఖ అధికారుల వద్దకు వెళ్లి అడిగిన వారికి సరైన జవాబు రాలేదని రైతులు చెబుతున్నారు.

ఒకే కుటుంబాల్లో ఇద్దరు ముగ్గురు రుణాలు పొందితే రుణమాఫీ కాదా? లేక వారి పేర్లు పంపడంలో అధికారులు ఏమైనా తప్పులు చేశారా? అనేది తెలియడం లేదు. కొంతమంది కుటుంబంలో ఉన్నవారికి రుణమాఫీ అనేది ఒకే కుటుంబంలో ఉన్న మరి కొంతమందికి రుణమాఫీ కాకపోవడం .రుణమాఫీ విషయంలో కుటుంబాన్ని యూనిట్ గా తీసుకున్నారా? లేక ఎవరికి వారే రుణమాఫీకి అర్హులని మాఫీ చేశారా? రైతులకు అర్థం కావడం లేదని అంటున్నారు. కుటుంబాన్ని యూనిట్ గా తీసుకున్న పక్షంలో కొన్ని కుటుంబాల వారికి రుణమాఫీ ఎలా అయిందని రైతులు ప్రశ్నిస్తున్నారు .రేషన్ కార్డు లేని వారికి సైతం రుణమాఫీ చేశామని ఒకపక్క ప్రభుత్వం చెబుతుండగా మరోపక్క కుటుంబంలోని తండ్రి కుమారులను ఎలా యూనిట్ గా తీసుకుంటారు అనే ప్రశ్న రైతుల నుండి వినవస్తుంది. తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన మిర్యాల శ్రీనివాస్ 79 వేల రుణాన్ని కెనరా బ్యాంకులో పొంది ఉన్నారని తన రుణమాఫీ ఎందుకు అర్థం కావడం లేదని అంటున్నారు. తాను తీసుకున్న రుణాన్ని రెన్యువల్ కూడా చేయించుకున్నారని శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తాను తీసుకున్న రుణం ఎందుకు మాఫీ కాలేదని తెలియడం లేదని బ్యాంకు అధికారులు అడిగిన సమాధానం చెబుతున్నారని చెప్పారు. తనకు పట్టాదార్ పుస్తకం ఉందని తన పేరు రేషన్ పాస్ కార్డు ఉందని శ్రీనివాస్ చెబుతున్నారు.

అలాగే మండల కేంద్రానికి చెందిన బోయిన నాగయ్య తాను ఏపీజీవీబీ బ్యాంకులో ₹1,00,000పైగా రుణం పొంది ఉన్నారని తన భార్య పేరు కూడా రుణం పొంది ఉన్నారని ఇరువురిలో ఎవరి రుణం మాఫీ కాలేదని కేవలం వ్యవసాయ ఆధారంతో జీవనం సాగిస్తున్నామని నాగయ్య తెలిపారు. పులుసు వెంకటనారాయణ మాట్లాడుతూ కెనరా బ్యాంకులో రెండు లక్షల లోపు రుణం పొందామని తనకు రుణం మాఫీ కాలేదని అంటున్నారు.పులుసు ఉదయ్,సుభద్ర అనే రైతులకు సైతం 2 లక్షల లోపు రుణం తీసుకున్న రుణమాఫీ కాలేదని చెప్పారు. మండల కేంద్రానికి చెందిన యాదగిరి శర్మ మాట్లాడుతూ ఏపీజీవీబీ బ్యాంకులో 50 వేల రుణం పొంది ఉన్నారని తన రుణమాఫీ కాలేదని చెప్పారు. ఇలాగే మరికొంతమంది రైతులు సైతం తమ రుణమాఫీ కాలేదని ఆరోపిస్తున్నారు. బ్యాంకుల చుట్టూ తిరిగి వ్యవసాయాధికారులను అడిగిన ప్రయోజనం పోతుందని రైతులు చెబుతున్నారు .

రైతుల రుణమాఫీ విషయంలో సరైన సమాధానం ఇచ్చేవారు తెలియక రైతులు తికమకపడుతున్నారు. ఏ అధికారిని అడిగినా తమ జాబితా లేదని బ్యాంకులో అడిగిన తమకి ఇంకా అధికారికంగా జాబితా రాలేదని చెబుతున్నట్లు .రైతులు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి అడిగిన ఫలితం శూన్యంగానే ఉందని చెబుతున్నారు. రుణమాఫీ పూర్తయిందని సంబరాలు చేసుకుంటున్న అధికారులు ప్రభుత్వం రుణమాఫీ కానీ రైతులకు సమాధానం చెప్పాల్సి ఉందనేది రైతుల మాట. ఇంకా మండలంలో వందలాది మంది రైతులకు రుణమాఫీ కానీ విషయం ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోంది. రుణమాఫీ కానీ రైతులు త్వరలోనే సంబంధిత కార్యాలయాలు బ్యాంకు ఎదుట ధర్నా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రభుత్వం లేదా బ్యాంకర్లు లేదా వ్యవసాయ శాఖ అధికారులు రుణమాఫీ కానీ రైతులకు ఎందుకు రుణమాఫీ లేదు స్పష్టంగా తెలపాలని ఏమైనా రైతుల వద్ద లోపాలు ఉన్నాయా చూపాలని రైతులు కోరుతున్నారు .

అన్ని రుణమాఫీకి అర్హతలు ఉన్న రైతులకు రుణమాఫీ ఎందుకు తెలియక ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే వారే లేరని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా అధికారులు ప్రభుత్వం స్పందించి రుణమాఫీ పై ఒక స్పష్టత ఇవ్వడానికి రుణమాఫీ కానీ వారికి ఎందుకు సమాధానం చెప్పాల్సి ఉందని రైతుల మాట. ఏది ఏమైనా తుంగతుర్తి వారి పలు రైతుల రుణమాఫీ కాక తీవ్ర మనోవేదనకు గురవుతున్నందున అటు బ్యాంకర్లు గాని ఇటు వ్యవసాయ శాఖ అధికారులు కానీ సరైన సమాధానం ఇవ్వకపోవడం ఆందోళన కలిగించే విషయంగా రైతులు చెబుతున్నారు. ఏది ఏమైనారుణమాఫీ కానీ రైతులకు అధికారులు స్పష్టమైన సమాధానమివ్వాలని రైతులు కోరుతున్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech