ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(allu arjun)నేషనల్ క్రష్ రష్మిక(rashmika)కాంబోలో తెరకెక్కిన పుష్ప 2(pushpa 2)ఈ నెల ఐదున విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. పుష్ప పార్ట్ 1 లో ఈ ఇద్దరి జోడి సినిమా విజయానికి ఎంతగానో కారణమైన దృష్ట్యా పుష్ప 2 లో కూడా ఇద్దరు ఎలా నటించారనే ఆసక్తి అందరిలో ఉంది.ఇక ఇద్దరు కలిసి 2 ప్రమోషన్స్ కి సంబంధించి జరుగుతున్న ఈవెంట్స్ కి కూడా హాజరవుతున్నప్పుడు సినిమా విజయం పట్ల తమ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇక రష్మిక లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతుంది 'నా జీవితం పూలపాన్పేమీ కాదు.చిన్నతనంలో చాలా దుర్భరమైన పేదరికాన్ని అనుభవించాను.నాన్న చేసిన వ్యాపారాలు ఒక్కసారిగా నష్టాల్లో కూరుకుపోవడంతో కొన్ని సంవత్సరాల పాటు తీవ్ర ఇబ్బందులు పడ్డాం. ఆ సమయంలో ఇంటిని నడిపించడానికి నాన్న చాలా కష్టపడ్డారు. ఇంటి అద్దె కూడా చెల్లించలేని స్థితికి వచ్చేశాం.దాంతో ఇల్లు ఖాళీ చేయమని యజమాని ఒత్తిడి పెట్టేవారు.అలా అద్దె కట్టలేక ప్రతీ రెండు నెలలకొకసారి ఇల్లు మారుతూనే వాళ్లమని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
కర్ణాటకలోని విరాజ్ పేట్ కి చెందిన రష్మిక 2016 లో రక్షిత్ శెట్టి హీరోగా విడుదలైన కన్నడ మూవీ 'కిరాక్ పార్టీ' తో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత అంజనీ పుత్ర, చమక్, ఛలో,గీత గోవిందం,భీష్మ, సుల్తాన్ యానిమల్, సీతారామం, పుష్ప పార్ట్ 1 ,మిషన్ మంజు,వారిసు వంటి పలు కన్నడ, తెలుగు, హిందీ, తమిళ సినిమాల్లో నటించి అగ్ర రేంజ్ కి వెళ్ళింది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ మూవీ సికందర్ తో పాటు చావా, కుబేర,ది రెయిన్ బో, గర్ల్ ఫ్రెండ్ వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ రష్మిక చేతిలో ఉన్నాయి.