Home ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీపై ఏపీ ప్రభుత్వం కసరత్తు …ఈ నెల 19న నూతన మద్యం పాలసీ నోటిఫికేషన్…! – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

మద్యం పాలసీపై ఏపీ ప్రభుత్వం కసరత్తు …ఈ నెల 19న నూతన మద్యం పాలసీ నోటిఫికేషన్…! – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
మద్యం పాలసీపై ఏపీ ప్రభుత్వం కసరత్తు ...ఈ నెల 19న నూతన మద్యం పాలసీ నోటిఫికేషన్...! - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ఈ నెల 18న రాష్ట్ర క్యాబినెట్‌లో కొత్త మద్యం పాలసీపై చర్చించి 19న నోటిఫికేషన్ విడుదల కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అక్టోబర్ 1 నుంచి పాలసీని అమలు యోచిస్తోంది. ఆన్‌లైన్ లాటరీ ద్వారా షాపుల లైసెన్సులు జారీ చేయనుంది. వైసీపీ హయాంలో ప్రభుత్వ పరిధిలో షాపులు ఉండగా, ఇకపై ప్రైవేటు వ్యక్తులకే అప్పగించే అవకాశం ఉంది. తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందిస్తామని సీఎం, మంత్రులు ప్రకటించిన విషయం తెలిసిందే.

ఏయే ఉత్పత్తుల్లో ఎన్ని మద్యంను నోటిఫై చేయాలి, దరఖాస్తు రుసుములు, నాన్‌ రిఫండబుల్‌ ఛార్జీలు, లైసెన్సు రుసుములు ఎలా ఉండాలి? తదితర అంశాలను అధికారులు సమర్పించిన ప్రతిపాదనలను పరిశీలించారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఆటోనగర్‌లోని ఎక్సైజ్‌, కొల్లు రవీంద్ర, గొట్టిపాటి రవి, నాదెండ్ల మనోహర్, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్ యాదవ్‌లతో కూడిన మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. ఈ సందర్భంగా 2019 కంటే ముందు రాష్ట్రంలో అమలులో ఉన్న మద్యం విధానాన్నే తీసుకురావాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ నెల 18న మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటోంది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech