తెలుగు సినిమాప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని పేరు నాగబాబు.నటుడుగా,నిర్మాతగా తన సత్తా చాటిన ప్రేక్షకుల్లో తన కంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన నాగబాబు, తన సోదరుడు పవన్ కళ్యాణ్(పవన్ కళ్యాణ్) స్థాపించిన జనసేన(జనసేన)పార్టీలో క్రియాశీలక పాత్ర కూడా పోషించాడు.ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నాగబాబు తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టాడు. కొట్టినట్టు చెప్పడంలో దిట్ట.ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక ట్వీట్ చేశారు.
నాగబాబు(naga babu)సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ 'ఎక్స్' వేదికగా 'నువ్వు వెళ్లే దారి తప్పు అని గుర్తిస్తే వెంటనే సరిదిద్దుకో.అలా కాకుండా ఎక్కువ కాలం వేచి ఉన్నావంటే వెనక్కి తిరిగి రావడం కష్టమవుతుందని ట్వీట్ చేసాడు.మరి నాగబాబు మళ్లీ ఏ ఉద్ద్యేశంతో ఈ ట్వీట్ చేసాడో తెలియదుగాని, అల్లు అర్జున్(అల్లులు) arjun)నటించిన 2(పుష్ప 2)రిలీజ్ కి పుష్ప రోజులే ఉన్న టైం లో నాగబాబు చేసిన ఆ ట్వీట్ ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. అల్లు అర్జున్ ఆంధ్రప్రదేశ్ లో గత ఎన్నికల్లో జనసేన తరుపున కాకుండా వైసిపి తరుపున పోటీ చేసిన శిల్ప రవిచంద్రారెడ్డి కి మద్దతుగా నిలిచినప్పట్నుంచి మెగా, అండ్ అల్లు అర్జున్ మధ్య దూరం పెరుగుతూ వస్తుంది. ఆ సమయంలో కూడా నాగబాబు 'మాతో ఉంటూ ప్రత్యర్థులకు పని చేసేవాడు, మావాడైనా పరాయివాడే,మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అని ట్వీట్ చేసాడు.
ఈ నేపథ్యంలోనే ఇప్పుడు నాగబాబు చేసిన నయా ట్వీట్ సంచలనం సృష్టిస్తుంది.ఇక అల్లు అర్జున్ అయితే నాగబాబు ట్వీట్‌పై అభిమానులు మండిపడుతున్నారు. రిలీజ్‌కి ముందు బెదిరిస్తున్నావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.మరి ఈ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతున్న దృష్ట్యా అల్లు అర్జున్ స్పీచ్ మీద అందరిలో ఉత్కంఠత నెలకొని ఉంది.ఇక పుష్ప 2 పై ఇప్పటికి మెగా దాకా కాంపౌండ్ సైలెంట్ గా ఉండటం విశేషం.