ప్రముఖ దివంగత నటి, డాన్సర్ అయిన సిల్క్ స్మిత(సిల్క్ స్మిత)గురించి తెలియని దక్షిణ భారతీయసినీ ప్రేమికుడు లేడు.పదిహేడు సంవత్సరాల తన సినీ కెరీర్లో తెలుగుతో పాటు తమిళ,మలయాళ, కన్నడ,హిందీ భాషల్లో కలిపి నాలుగు వందల యా సినిమాల్లో నటించిన ఘన చరిత్ర సిల్క్ స్మిత సొంతం.ప్రస్తుతం ఆమె జీవిత చరిత్ర చరిత్ర ఆధారంగా 'సిల్క్ స్మిత' క్వీన్ ఆఫ్ ది సౌత్ అనే టాగ్ లైన్ తో ఒక చిత్రం రూపుదిద్దుకుంటుంది.తెలుగు,తమిళ,మలయాళ,కన్నడ,హిందీ భాషల్లో రిలీజ్ కానుండగా లేటెస్ట్ గా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ని చిత్ర బృందం రిలీజ్ చేయడం జరిగింది.
భారత మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ(ఇందిరా గాంధీ)కొన్నివార్తా పత్రికలతో పాటు,మాగజైన్లని చదువుతూ ఉంటుంది.వాటన్నింటిలోను సిల్క్ స్మిత గురించి చాలా గొప్పగా ఆర్టికల్స్ రాసి ఉంటాయి. దీంతో ఎవరు సిల్క్ స్మిత అని తన అసిస్టెంట్ ని అడగ్గానే, అతను ఐరన్ లేడి, మాగ్నటిక్ లేడీ అంటూ సిల్క్ స్మిత గురించి గొప్పగా చెప్తాడు.ఇలా స్టార్ట్ అయిన టీజర్ ఆ తర్వాత సిల్క్ స్మితకి పబ్లిక్ లో ఉన్న ఇమేజ్ తో పాటుగా తన లైఫ్ లో ఎదురైన బాధలు కూడా ఆమెకి గుర్తుకొస్తున్నట్టుగా చూపించారు. ఇండియన్ సినీ పరిశ్రమ గర్వించదగ్గ ఇళయరాజా ఇచ్చిన ఆర్ ఆర్ అయితే ఒక రేంజ్ లో ఉంది.
ఇక సిల్క్ స్మితగా చంద్రిక రవి(చంద్రిక రవి)చేస్తుండగా ఎస్టీ ఆర్ ఐ సినిమాల పతాకంపై విజయ్ అమృత రాజ్ నిర్మాతగా జయరామ్(జయరామ్) దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. వివిధ భాషలకి చెందిన నటులు నటిస్తుండగా రిలీజ్ డేట్ కూడా త్వరలోనే వెల్లడి మీకు.