ఈటీవీలో ప్రసారమయ్యే 'ఢీ' ప్రోగ్రాం ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన డాన్సర్ కన్హ మహంతి.(kanha mohanty)పదహారేళ్ల వయసు 'ఢీ' లోకి ఎంట్రీ ఇచ్చిన మహంతి మెరుపులాంటి తన డాన్స్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.ఆ తర్వాత 'ఢీ' 10 లో పోటీ కి పెర్ఫార్మర్ గా కూడా చేసిన మహంతి 'ఢీ' 'జోడిలో కూడా అదిరిపోయే పెర్ఫార్మ్ చేసి కొరియోగ్రాఫర్ స్థాయికి ఎదిగాడు.
రీసెంట్ గా హైదరాబాద్ మాదాపూర్ లో ఉన్న ఒక ఓయో రూమ్ లో డ్రగ్స్ పార్టీ చేసుకుంటూ మహంతి పోలీసులకి పట్టుబడ్డాడు.ఆ సమయంలో అక్కడ ఉన్న ఎండీఎంఏ డ్రగ్స్ తో పాటు మరో రెండు రకాల డ్రగ్స్ ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ప్రముఖ ఆర్కిటెక్చర్ ప్రియాంక రెడ్డి ఇచ్చిన ఆ పార్టీలో మహంతి తో పాటు ఇంకో నలుగురిని కూడా అరెస్ట్ చేశారు. .
మహంతి సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉండడంతో పాటు సొంతంగా పాటలు చేస్తూ తన యూ ట్యూబ్ ఛానల్ లో అప్ లోడ్ చేస్తుంటాడు. పెద్ద సంఖ్యలో మహంతి కి ఫాలోవర్స్ కూడా ఉన్నారు.