ఏపీలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు (ఎఫ్బిసి) అందుబాటులో ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన చర్యలను ప్రభుత్వం చేపడుతోంది. వివిధ శాఖల వద్ద ఉన్న కుటుంబాన్ని క్రోడీకరించి దీన్ని రూపొందించినట్లు చెబుతున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలను అందించడమే లక్ష్యంగా ఈ కార్డులను అందించడానికి ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఆర్థికంగా పైకి తీసుకురావాలన్న ప్రభుత్వం నిర్ణయం ప్రకారం ఈ శ్రీకారం చుడుతున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. కృత్రిమ మేధా ఆధారంగా ఇది పని చేయనుంది. ఒక కుటుంబం యొక్క ఆర్థిక స్థితిని గుర్తించి, వారికి ఎప్పటికీ అందుతున్న వివిధ పథకాలు, విద్యార్థుల ఆర్థిక అభివృద్ధికి ఇంకా ఎటువంటి అవసరం లేదు అన్న విషయాలను గుర్తించి వాటికి అనుసంధానిస్తుంది. పేదరికం లేని సమాజం నిర్మాణమైన రాష్ట్ర ప్రభుత్వం త్వరలో విడుదల చేయనున్న స్వర్ణాంధ్ర -2047 సాధనకు ఇది కీలకంగా మారుతుందని అంటున్నారు. ఆయా కుటుంబ సభ్యులు మొబైల్ యాప్ లో ఈ సమాచారం అంతా చూసుకోవచ్చు. డిసెంబర్ రెండో తేదీన సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ శాఖల అధికారులతో పాటు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో సమావేశమై చర్చించనున్నారు. దీనికి సంబంధించిన కీలక సూచనలు ఆయన చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో సీఎం చంద్రబాబు నాయుడు అనేక హామీలను ఇచ్చారు. ఇందులో నిరుపేద వర్గాలను ఆర్థికంగా అభివృద్ధిలోకి తీసుకురావడమే తమ ముందున్న లక్ష్యమని, తాము అధికారంలోకి వచ్చిన ఆ దిశగా పనిచేస్తామని ఆయన వెంటనే స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఈ నూతనంగా ఆయన శ్రీకారం చుడుతున్నట్లు చెబుతున్నారు.
సరదాగా ప్రభుత్వం తీసుకురావాలని కోరుకుంటున్న ఫ్యామిలీ బెనిఫిట్ కార్డుకు సంబంధించిన కార్యక్రమ అమలు 2019లోనే అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభమైంది. ప్రపంచ బ్యాంకుకు ప్రతిపాదన కూడా ఇచ్చారు. రాష్ట్ర డేటా సెంటర్లలో అన్ని వివరాలను అనుసంధానించే చర్యలను కలిగి ఉంది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని పట్టించుకోలేదు. ప్రస్తుతం దేశంలోని అనేక రాష్ట్రాలు ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం కూడా ఫ్యామిలీ బెనిఫిట్ కాదు అందించాలని నిర్ణయించింది. ఈ కార్డులు శాఖ అవసరమైన పౌరసరఫరాల, సెర్ఫ్, గ్రామ/వార్డు సచివాలయం, పంచాయతీరాజ్ వంటి ప్రభుత్వాల నుంచి తీసుకోనున్నారు. ఈ కార్డుల్లో భాగంగా ప్రతి కుటుంబానికి ఒక యూనిక్ ఐడి ఇవ్వనున్నారు. అందులో కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు ఉంటాయి. ఏ పథకం ద్వారా ఎంత ప్రయోజనం వస్తోంది అనే సమాచారం ఉంటుంది. కొత్త పథకాలకు అర్హులైతే కుటుంబ సభ్యులకు అనుసంధ నుంచి వర్తింపజేయనున్నారు. రానున్న రెండు మూడు నెలల్లో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సోమవారం జరగనున్న దీనికి సంబంధించిన కీలక నిర్ణయం తీసుకోవాలని అధికారులకు విధివిధానాలపై ఒక స్పష్టతను ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఏడో తరగతి చదివినా ఉద్యోగ అవకాశం.. జగిత్యాల పోలిస్ శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా
సెలయేరు పారుతున్న పార్టు 2 హీరోయిన్స్ నివేద్య ఆర్ శంకర్ ఫొటోస్