రామ్‌చరణ్, శంకర్ కాంబినేషన్లో దిల్‌రాజు చిత్రం 'గేమ్ ఛేంజర్' సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. ఈ సినిమా షూటింగ్ తర్వాత చరణ్ తర్వాత సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఉంది. ఎంతో కాలంగా ఆరోజు డైరెక్టర్ సానా బుచ్చిబాబు కూడా వెయిట్ చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం ఈ సినిమా ప్రారంభోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. కానీ, సాధారణ షూటింగ్ మాత్రం మొదలవ్వలేదు. నవంబర్ వచ్చేసింది. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాదిలోనేనని అందరూ భావించారు. నెక్స్ట్ ఇయర్లో ఆర్సి16 స్టార్ట్ అవుతుందని అందరూ ఫిక్స్ అయిపోయారు.
ఇదిలా ఉంటే.. గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ మైసూర్లో ప్రారంభం అవుతుందని ప్రచారం. అయితే అది నిజమేనని డైరెక్టర్ బుచ్చిబాబు శుక్రవారం అందరికీ క్లారిటీ ఇచ్చారు. ఈరోజు మైసూర్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. మైసూరు చాముండేశ్వరి అమ్మవారి ఆలయంలో ఈ సినిమా కోసం ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. 'ఇది ఎంతో ముఖ్యమైన రోజు. ఎన్నోరోజులుగా ఉండే రోజు వచ్చేసింది. మీ అందరి ఆశీర్వాదం ఉండాలి' అంటూ ఎంతో ఎమోషనల్‌గా ట్వీట్ చేశారు బుచ్చిబాబు. అంతేకాదు, సినిమాకి సంబంధించిన బౌండెడ్ స్క్రిప్ట్ పట్టుకొని చాముండేశ్వరి అమ్మవారి ఆలయం ముందు ఆయన దిగిన ఫోటోను కూడా షేర్ చేశారు. అనుకోకుండా బయటికి వచ్చిన ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ న్యూస్‌ని, ఫోటోను షేర్ చేస్తున్నారు అభిమానులు.
విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు రామ్‌చరణ్ ఇప్పటికే మైసూరు చేరుకున్నారు. మొదటి షెడ్యూల్ చరణ్‌తోనే ప్రారంభిస్తారని సూచిస్తుంది. ప్రధాన తారాగణం అంతా ఈ షెడ్యూల్లో ఉంటారు. ఈ జగపతిబాబు ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ షెడ్యూల్లో ఆయనకు సంబంధించిన సన్నివేశాలను కూడా చిత్రీకరిస్తారు. ఈ సినిమాలో చరణ్ సరసన జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ షెడ్యూల్లో జాన్వీ పాల్గొనే అవకాశం లేదు. ప్రస్తుతం బాలీవుడ్లో షూటింగ్స్‌తో ప్రస్తుతం ఉన్న జాన్వీ రెండో షెడ్యూల్లో ఆర్సి16 సెట్స్‌కి వచ్చే అవకాశం ఉంది. 'దేవర' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన జాన్వీ మరోసారి తన అందచందాలతో ప్రేక్షకులకు కనువిందు చేసేందుకు సిద్ధమవుతోంది.