ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు(chandrababu naidu)ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్(pawan kalyan)పై గత ఎన్నికల సమయంలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఏపీలోని ప్రకాశం జిల్లా మద్దిపాడు(maddipadu)పోలీస్ స్టేషన్ లో రామ్ గోపాల్ వర్మ(ram gopal varma)పై నమోదయిన విషయం తెలిసిందే. .దీంతో మద్దిపాడు పోలీసులు వర్మని కలిసి విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. విచారణ పై మధ్యంతర ఉత్తుర్వులు జారీచేయాలంటూ వర్మ ఏపి హైకోర్ట్‌లో పిటిషన్ దాఖలు చేసాడు.కానీ ఈ విషయంలో మధ్యంతర ఉత్తర్వులు జారీచేయలేమంటూ కోర్టు తన తీర్పును ప్రకటించింది.
కానీ వర్మ పోలీసుల విచారణకు హాజరుకాకుండా ఒంగోలు రూరల్ సిఐ శ్రీకాంత్ బాబుకు వాట్సాప్ ద్వారా నాకు ఇంకో నాలుగు రోజుల సమయం కావాలని అడిగినట్టుగా తెలుస్తుంది. మరి ఈ విషయంలో పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే ఆసక్తి అందరిలో ఉండగా వర్మ కూడా అజ్ఞాతంలో కి వెళ్తుంటాడా అనే చర్చ సినీ అండ్ పొలిటికల్ వర్గాల్లో జరుగుతుంది.