Home సినిమా నారారోహిత్ తండ్రి మరణానికి కారణం ఇదే..కృత్రిమ శ్వాస కూడా ఇచ్చారు – Prajapalana News

నారారోహిత్ తండ్రి మరణానికి కారణం ఇదే..కృత్రిమ శ్వాస కూడా ఇచ్చారు – Prajapalana News

by Prajapalana
0 comments
నారారోహిత్ తండ్రి మరణానికి కారణం ఇదే..కృత్రిమ శ్వాస కూడా ఇచ్చారు


తెలుగు చిత్ర సీమలో వైవిధ్యమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించే హీరోల్లో నారా రోహిత్(nara rohit)కూడా ఒకడు. తన మొదటి సినిమా బాణం దగ్గరనుంచి మొన్న ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎలక్షన్స్ కి ముందు వచ్చిన ప్రతిధ్వని పార్ట్ 2 చిత్రాలే ఉదాహరణ.శనివారం నాడు అయన తండ్రి మాజీ ఎంఎల్ఏ నారా రామ్మూర్తి నాయుడు చనిపోయిన విషయం తెలిసిందే.

కార్డియో రెస్పిరేటరీ సమస్యల కారణంగానే రామ్మూర్తి నాయుడు(ramamurthy naidu)చనిపోయారు. కార్డియో రెస్పిరేటరీ అంటే శరీరంలోని అన్నింటికి ప్రవహించే రక్త ప్రసరణ ఒక్కసారిగా హఠాత్తుగా ఆగిపోతుంది. ఈ కారణంతోనే పద్నాలుగవ తారీఖున ఆయనకి గుండె పోటు రావడంతో కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్చారు.దీంతో డాక్టర్స్ స్టంట్ కూడా వేయడం జరిగింది. కొంత కోలుకుంటున్నారు అనే లోపే గతంలోనే ఆయనకి ఉన్న శ్వాస కి సంబంధించిన కారణాల వల్ల పల్మనరీ ఇష్యూస్ ట్రిగర్ అవడంతో పాటుగా ఊపిరితిత్తుల సమస్యలు కూడా ఎక్కువ అవ్వడంతో సీపాప్ ద్వారా కృత్రిమంగా శ్వాస కూడా అందించడానికి డాక్టర్ ట్రై చేసారు.

కానీ పదహారవ తేదీ ఉదయం మళ్ళీ కార్డియాక్ అటాక్ అవ్వడంతో చనిపోవడం జరిగింది.నిన్న ఆయన స్వగ్రామం నారావారి పల్లె లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి.
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(చంద్రబాబు నాయుడు)కి రామ్మూర్తి నాయుడు తమ్ముడు అన్న విషయం తెలిసిందే.


You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech