Home ఆంధ్రప్రదేశ్ నారా రామమూర్తి నాయుడు కన్నుమూత.. దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన ప్రముఖులు – Prajapalana News

నారా రామమూర్తి నాయుడు కన్నుమూత.. దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన ప్రముఖులు – Prajapalana News

by Prajapalana
0 comments
నారా రామమూర్తి నాయుడు కన్నుమూత.. దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన ప్రముఖులు


ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోదరుడు, మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు శనివారం మధ్యాహ్నం కన్నుమూశారు. గడిచిన కొద్దిరోజుల నుంచి హైదరాబాదులోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కార్డియాక్ అరెస్టు కావడంతో శనివారం మధ్యాహ్నం మృతి చెందారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఏఐజి ఆసుపత్రికి వెళుతున్నారు. ఆదివారం స్వస్థలం చిత్తూరు జిల్లా నారావారి పల్లెలో అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.

నారా రామమూర్తి నాయుడు 1994లో చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నారా ఖర్జూర నాయుడు, అమ్మన్నమ్మ దంపతుల రెండో కుమారుడు రామ్మూర్తి నాయుడు. పెద్ కుమారుడు చంద్రబాబు నాయుడు. వీరి స్వస్థలం ఉమ్మడి చిత్తూరు జిల్లా నారావారిపల్లె. సోదరుడు చంద్రబాబు టిడిపిలో కీలకంగా మారుతున్న సమయంలో రామ్మూర్తి నాయుడు టిడిపి నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు. 1994 ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఓటమి చెందగా.. రామ్మూర్తి నాయుడు రాజకీయాల నుంచి వైదొలిగారు. రామ్మూర్తి నాయుడుకు ఇద్దరు కుమారులున్నారు. వీరు నారా రోహిత్ సినీ రంగంలో ఉన్నారు. మరో కుమారుడు నారా గిరీష్. ఇదిలా ఉంటే గత నెలలో రామ్మూర్తి నాయుడు తనయుడు, టాలీవుడ్ హీరో నారా రోహిత్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది.

నారా నమూరి కుటుంబ సభ్యుల సమక్షంలో అక్టోబర్ 13న నారా రోహిత్ నిశ్చితార్థం జరగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సహా కుటుంబ సభ్యులంతా ఉన్నారు. కొద్దిరోజుల్లోనే నారా రోహిత్ పెళ్లి పీటలు ఎక్కాల్సి ఉంది. అంతలోనే ఆయన మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే సోదరుడి ఆరోగ్య పరిస్థితి విషమించిందన్న విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు. అలాగే, అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ బాబాయ్ కు సీరియస్ గా ఉన్న విషయం తెలుసుకొని హుటాహుటిన హైదరాబాద్ కు పతనమయ్యారు. వీరితోపాటు ఇతర కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు బయలుదేరుతున్న ఆయన తుది శ్వాస విడిచినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వీరితో కుటుంబ సభ్యులతోపాటు నారా అభిమానులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. నారా రామమూర్తి నాయుడు మృతి పట్ల టిడిపికి చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతోపాటు కీలక నాయకులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.

చనిపోయినవారి నోట్లో తులసి దళాన్ని ఎందుకు ఉంచుతారంటే..
బీట్‌రూట్ తినీ తినీ బోర్ కొడుతోందా.. ఇలా ట్రై చేయండి

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech