శివకార్తికేయన్(siva karthikeyan)సాయిపల్లవి(sai pallavi)జంటగా దివాళి కానుకగా ఈ నెల 31న విడుదలైన మూవీ అమరన్(amaran)పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ మూవీని కమల్ హాసన్(kamal haasan)అత్యంత భారీ వ్యయంతో నిర్మించగా,రాజ్ కుమార్ పెరియ స్వామి దర్శకుడుగా వ్యవహరించాడు.తమిళనాడు మేజర్ ముంద్ వరద రాజన్ జీవిత కథ ఆధారంగా విడుదలైన అన్ని ఏరియాల్లో మంచి కలెక్షన్స్ ని సాధిస్తుంది.
రీసెంట్ గా ఈ మూవీని ప్రదరిస్తున్న తమిళనాడులోని తిరునల్వేలి(తిరునల్వేలి)కి చెందిన అలంకార్(అలంకార్)థియేటర్ పై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబ్ లతో దాడి చేయడం జరిగింది.స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకునేపే దుండగులు అక్కడ నుంచి పారిపోయారు. అయితే ఎవరకి ఎలాంటి గాయాలు అవ్వలేదు. అమరన్‌లో ఒక వర్గానికి వ్యతిరేకంగా సన్నివేశాలు ఉన్నాయనే ఆగ్రహంతోనే దాడి జరిగినట్టుగా కొంత మంది చెబుతున్నారు.కానీ పోలీసులు మాత్రం స్థానికంగా ఉన్న గొడవల కారణంగా జరుగుతున్న అనుమానాన్ని వ్యక్తం చేస్తూ తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.
థియేటర్ కి అయితే పోలీసులు భారీ బందోబస్తును కల్పించారు. కానీ ఎవరు ఊహించని విధంగా దాడి జరగడంతో మూవీ లవర్స్ తో పాటు శివ కార్తికేయన్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.