పుష్ప(పుష్ప)పార్ట్ 1లోని 'ఊ అంటావా మావ' ఐటెం సాంగ్ ఎంత పెద్ద విజయాన్ని అందుకుంటుందో అందరకీ తెలిసిందే.అల్లు అర్జున్(allu arjun)తో కలిసి సమంత(samantha) వేసిన స్టెప్స్ కి పాన్ ఇండియా ప్రేక్షకులు ఎంతగానో ఫిదా అయ్యారు. దీంతో ఇప్పుడు పార్ట్ 2 లో ని ఐటెం సాంగ్ పై భారీ అంచనాలు ఉన్నాయి.పైగా ఆ సాంగ్ లో అల్లు అర్జున్ తో డాన్సింగ్ క్వీన్ శ్రీలీల జత కట్టడంతో అంచనాలు రెట్టింపు అయ్యాయని కూడా చెప్పుకోవచ్చు.
కాకపోతే ఆ సాంగ్ ఐటెం సాంగ్ కాదనే వార్తలు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి.మూవీలో పుష్ప ఒక పార్టీ ఇస్తాడని, అప్పుడు శ్రీలీల సాంగ్ వస్తుందని,కాబట్టి అది పార్టీ సాంగ్ అనే వార్తలు వస్తున్నాయి. సాంగ్ లో ఎంతో మంది గెస్ట్ లు స్టెప్స్ వెయ్యవచ్చు.ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్, శ్రీలీల(sreeleela)తో పాటు రష్మిక(rashmikha)కూడా ఈ సాంగ్ లో స్టెప్స్ వేయనుందని అంటున్నారు. సమంత(సమంత)కూడా గెస్ట్ లాగా వచ్చి తనదైన స్టైల్లో నటించనుందని, అలాగే మరో టాప్ హీరోయిన్ కూడా ఆ సాంగ్ లో అలరించనుందనే వార్తలు వస్తున్నాయి.
బాలీవుడ్లో ఇలాంటి పాటలు ఎక్కువగా చిత్రీకరణ జరుపుకుంటాయి.హిందీలో మాత్రం ఎప్పటినుంచో ఇలాంటి సాంగ్స్‌ని ప్రదర్శించి ప్రేక్షకులకి కనువిందు చేస్తున్నాయి.కాకపోతే తెలుగులో నాగార్జున(నాగార్జున)హీరోగా వచ్చిన కింగ్ సినిమాలో ఒక పార్టీ సాంగ్ చిత్రీకరించి మరీ తారలు గెస్ట్లుగా డాన్స్ చేసి ప్రేక్షకులకు కనువిందు చేశారు.