- ఆయనలా భూములు కట్టబెట్టలేదంటూ చురకలు
- వారసత్వ ధృవీకరణ ఎలా ఇచ్చారు
- అఫడవిట్లు దాఖలు చేయండి
- అధికారులకు తెలిపిన న్యాయస్థానం
ముద్ర, తెలంగాణ బ్యూరో : భూముల వ్యవహారంలో వివాదస్పద ఐఏఎస్ అధికారిగా మారిన అమోయ్ కుమార్ పై తెలంగాణ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. నిజాం రాజు కూడా ఆయనలా భూములు కట్టబెట్టలేదని సీరియస్ గా వ్యాఖ్యానించింది. భూదాన్ భూముల పరిరక్షణలో విఫలమయ్యారని గత బోర్డుతో సహా అధికారులపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. భూదాన్ భూములంటూ ఆర్డీవో ఇచ్చిన ఆదేశాలను అప్పిలేట్ ట్రైబ్యునల్ అథారిటీ హోదాలో ధ్రువీకరించిన వ్యక్తే…రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఉన్నప్పుడు వారసత్వ ధ్రువీకరణ ప్రతం జారీ చేయడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. రంగారెడ్డి జిల్లా గత కలెక్టర్ ఇప్పటికే పలు కేసులు చూసినట్లు పత్రికల్లో కథనాలు చూశామని, నిజాం కూడా భూములను అలా కట్టబెట్టలేదని వ్యాఖ్యానించింది. ఆనాడు భూములను దివానీ, సర్ఫేకాజ్, పట్టాలు అనే మూడు రకాలుగా గుర్తించిన నిజాన్ని అభినందించాలని ప్రకటించారు. అధికారులపై ఆరోపణలు ఉన్నప్పుడు వారు కోర్టుకు సమాధానం చెప్పాల్సిందేనంటూ సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం సయ్యద్ యాకూబ్ కేసులో స్పష్టం చేసిందని హైకోర్టు పేర్కొంది.
అంతా అమ్ముకుని తినేశారా..!
భూదాన్ భూముల రక్షణకు అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పేదల కోసం రామచంద్రారెడ్డి 300 ఎకరాలు ఇవ్వగా..గతంలో ఉన్న భూదాన్ బోర్డుతో సహా అధికారులు అమ్ముకుని తినేశారని వ్యాఖ్యానించారు. తెలంగాణలో పేదలకు భూములు ఇచ్చిన ఎందరో గొప్పవాళ్లు ఉన్నారని, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు..అగ్రికల్చరల్ సీలింగ్ చట్టం అమల్లోకి వచ్చినప్పుడు 500 ఎకరాలు ఇచ్చారు.
భూదాన్ భూముల రక్షణలో గత బోర్డుతో సహా అధికారులు విఫలమయ్యారని కోర్టు పేర్కొంది. ఈ కేసులో 10 ఎకరాల భూమి భూదాన్ బోర్డుకు చెందినదని ధ్రువీకరించాక…వారసత్వ ధ్రువ పత్రం ఎలా జారీ చేస్తారో కౌంటర్‌ని నమోదు చేయాలంటూ ప్రస్తుత శాఖ ముఖ్య కార్యదర్శి, భూదాన్ యజ్‌గ్రామబోర్డు , వ్యక్తిగత హోదాలో గత కలెక్టర్ డి. అమోయ్ కుమార్ , అప్పటి డీఆర్ వో ఆర్పీ జ్యోతితో పాటు మరో ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులకు నోటీసులు జారీ చేసింది.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామం సర్వే నం. 182 లో10.92 ఎకరాలకు సంబంధించి ఖాదర్ ఉన్నీసా బేగంకు ధ్రువీకరణ పత్రం జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ నవాబ్ ఫరూక్ అలీఖాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీని పై జస్టిస్ రెడ్డి సీవీ భాస్కర్ విచారణ జరిగింది. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు గతంలో ఈ భూములను భూదాన్ భూములుగా ఆర్డీవో వెల్లడించినట్లు, స్పెషల్ ట్రైబ్యునల్ సమర్థించిందన్నారు. అందుకు విరుద్దంగా ట్రైబ్యునల్ కు నేతృత్వం వహించిన అధికారి కలెక్టర్ హోదాలో ఖాదర్ హున్సీసా బేగం ఇచ్చిన దరఖాస్తును ఆమోదించి పట్టాదారు పాస్ బుక్ జారీ చేశారన్నారు.
గా భూదాన్ భూములకు సంబంధించి యథాతథ స్థితి కొనసాగుతూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినా పట్టించుకోకుండా. వాదనలను విన్న న్యాయమూర్తి… భూదాన్ భూములకు సంబంధించి వివాదం పెండింగ్‌లో ఆలోచించకుండా పట్టాపాస్ బుక్ జారీ చేశారన్నారు. ఈ భూములపై యథాతథ స్థితిని కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వివాదానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను 28 కి వాయిదా వేశారు.