ప్రముఖ హీరో జూనియర్ (Jr NTR) రాజకీయాల్లో లేనప్పటికీ, రాజకీయాల్లో ఆయన పేరు తరచుగా ఎన్టీఆర్ వినిపిస్తూ ఉంటుంది. రెండేళ్ల క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ వచ్చినప్పుడు.. ఎన్టీఆర్ ని ప్రత్యేకంగా కలిసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆ విషయం హాట్ టాపిక్ అయింది. తాజాగా మరో ప్రముఖ బీజేపీ లీడర్.. ఎన్టీఆర్ ను కలవడం ఆసక్తికరంగా మారింది.
ఇటీవల 'వార్-2' షూటింగ్ కోసం ముంబై వెళ్లిన ఎన్టీఆర్, తాజాగా హైదరాబాద్ కి తిరిగొచ్చాడు. ఈ ముంబై ఎయిర్ పోర్ట్ లో ఎన్టీఆర్ ను పంజాబ్ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ అరవింద్ ఖన్నా కలిశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్న అరవింద్.. “ముంబై ఎయిర్‌పోర్ట్‌లో జూనియర్ ఎన్టీఆర్‌ను మీట్ అయ్యాను. అతని ఆప్యాయత, వినయం చూసి ఆశ్చర్యపోయాను. అత్యంత గ్రౌండెడ్ స్టార్స్‌లో ఒకరైన ఎన్టీఆర్‌ని కలవడం చాలా ఆనందంగా ఉంది.” అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.