- కొన్ని నిర్ణయాల్లో గవర్నల్ లీగల్ ఒపీనియన్ తీసుకోల్సి ఉంటుంది
- బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అనడం అవివేకం
- మేం బీఆర్ఎస్, కాంగ్రెస్ పక్షం కాదు.. ప్రజాపక్షం
- కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
ముద్ర, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిడిమిడి జ్ఞానంతో వ్యవహరిస్తున్నారని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. గవర్నర్ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా లీగల్ ఒపీనియన్ తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ కోరిక కొంత జాప్యం జరిగితే తొందరపాటుగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అంతమాత్రాన బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే చెప్పడం వివేకమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము బీఆర్ఎస్, కాంగ్రెస్ పక్షం కాదని, ప్రజాపక్షమని ఆయన పేర్కొన్నారు. అవినీతి ఎక్కడ జరిగినా విచారణ జరపాలన్నదే తమ డిమాండ్ అని అన్నారు. కాళేశ్వరం మీద సీబీఐ విచారణకు డిమాండ్ చేశామని, సీఎం విచారణ కోరారా? అని ప్రశ్నించారు.
తెలంగాణ అభివృద్ధికి వ్యతిరేకంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాయని తెలిపారు. వైఫల్యాలను, అసమర్ధత నుంచి దృష్టి మళ్లించేందుకు రెండు పార్టీలు పోటీ పడుతున్నాయని తెలిపారు. కేటీఆర్, కేసీఆర్ ఇచ్చే సర్టిఫికెట్లు మాకు అవసరం. వారి హయాంలో ప్రధాని మోడీ ప్రాజెక్టులను ప్రారంభిస్తే తెలంగాణకు రాని కేసీఆర్, కేటీఆర్ కు మాట్లాడే అర్హత లేదని ఆయన చెప్పారు. కలెక్టర్ మీద దాడి తప్పు అని భావిస్తున్న తరుణంలో గ్రామస్తుల మీద కూడా అక్రమ కేసులు పెట్టడం సరికాదన్నారు. సీఎం సొంత నియోజకవర్గంలో ఈ ఘటన జరిగింది, ఆయన తన ప్రజలతో మాట్లాడాలని కిషన్ రెడ్డి సూచించారు. మహారాష్ట్ర, జార్ఖండ్ లలో బీజేపీ అధికారంలోకి రాబోతుందన్నారు. ఒక్క అవినీతి, కుంభకోణం లేకుండా ఆరోపణ బీజేపీ, శివసేన ప్రభుత్వ పాలన సాగింది.