Home సినిమా ఢిల్లీలోని ఏపీ భవన్ లో విశాఖ ఉక్కు సినిమా గురించి సత్యారెడ్డి కీలక వ్యాఖ్యలు – Prajapalana News

ఢిల్లీలోని ఏపీ భవన్ లో విశాఖ ఉక్కు సినిమా గురించి సత్యారెడ్డి కీలక వ్యాఖ్యలు – Prajapalana News

by Prajapalana
0 comments
ఢిల్లీలోని ఏపీ భవన్ లో విశాఖ ఉక్కు సినిమా గురించి సత్యారెడ్డి కీలక వ్యాఖ్యలు


విశాఖ ఉక్కు తెలుగు వారి హక్కుల నినాదంతో దర్శక, నిర్మాత, హీరో, జనం స్టార్ సత్యారెడ్డి(sathya reddy)నిర్మించిన చిత్రం ఉక్కు సత్యాగ్రహం(ukku satyagraham)ప్రజా యుద్ధనౌక, విప్లవ కవి గద్దర్(gaddar)ఈ చిత్రంలో మూడు పాటలు పాడటమే కాకుండా రెండు పాటలతో పాటు కొన్ని సందేశాత్మక సీన్స్ లో కూడా నటించారు.పైగా ​​ఆయన నటించిన ఆఖరి చిత్రం కూడా ఇదే. గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ అద్భుతమైన సాహిత్యం అందించిన ఈ మూవీ ఈ నెల 29న విడుదలైంది.

ఈసందర్బంగా చిత్ర దర్శకుడు, నిర్మాత, కథానాయకుడు సత్యారెడ్డి ఢిల్లీలోని ఏ పి భవన్‌లో మాట్లాడుతువిశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో 32 మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా, గద్దర్ అన్నతో కలిసి ఉక్కు సత్యాగ్రహం అనే చిత్రాన్ని నిర్మించాను. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లోని అన్ని కార్మిక సంఘాలు, సంఘ నాయకులు, భూ నిర్వాసితులు మా సినిమాలో నటించారు. కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ సినిమాను నిర్మించామని సెన్సార్ లెట్ అవ్వడం వల్ల మరియు గద్దర్ గారి మరణం వలన ఈ సినిమా ఇన్ని రోజులు వాయిదా పడింది. కానీ ఇప్పుడు ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసి 300కు పైగా థియేటర్లలో ఈ నెల 29న బ్రహ్మాండంగా విడుదల చేస్తున్నాం. ఈ కాలంలో విప్లవానికి సంబంధించిన సినిమాలు తీయడం చాలా కష్టం. సెన్సార్ ఆపేస్తారు సినిమాని విడుదల చేయకుండా ప్రయత్నాలు చేస్తారు. కానీ ఆగకుండా విశాఖ ఉక్కు ఆంధ్రుల నినాదంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా విజయాన్ని సాధించిన కారణంగా ఈ సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది.

ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలు ఈ సినిమాలో చూపిస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రం మద్రాస్ నుంచి విడిపోయిన తర్వాత కర్నూలు రాజధానిగా వచ్చినప్పుడు ఏం జరిగింది? అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ను మద్రాస్ లో పెట్టాలి అని ఇందిరాగాంధీ గారు అనుకున్నప్పుడు ఏం జరిగింది? అనేది చూపించాం. ఈ కథని గద్దర్ అన్నే రాసాడు.నాలుగు పాటలు కూడా రాసి కొన్ని కీలక సన్నివేశాల్లో కూడా నటించారు. తన వారసులు ఎలా ఉండాలి ఉద్యమాలు ఎలా నిర్మించాలి అనేది కూడా ఆయన చనిపోయే ముందు రాసుకున్న చివరి పాట. ఉద్యమకారులు, గద్దర్ గారి అభిమానులు మరియు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీ కోటి సంగీతాన్ని అందించాడు.


You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech