- ఆ పార్టీ నేతలు ప్రభుత్వాన్ని కూల్చడమే పనిగా పెట్టుకున్నారు
ముద్ర, తెలంగాణ బ్యూరో : అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ దుర్మార్గపు రాజకీయాలు చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రజా ప్రభుత్వాన్ని కూల్చడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆ పార్టీ నేతలు అమాయక ప్రజలను రెచ్చగొడుతున్నారు. అలాంటి చర్యలను కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని. గురువారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన ఏ విషయంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందో చెప్పాలని డిమాండ్ చేశారు పరిశ్రమల స్థాపన వైఫల్యమా? పంట నష్టం రైతులు ప్రమాదవశాత్తు చనిపోతే వాళ్లకు ఇన్సూరెన్స్ చెల్లించడం విఫలమా? సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించడం ప్రభుత్వ వైఫల్యమా? అని ప్రశ్నించారు.బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రజల సమస్యల కోసం ఏనాడు సచివాలయానికి రా సహాయం చేశారు.
ఎప్పుడు ప్రభుత్వాన్ని అట్లా కూల్చాలి, ఇట్ల కూల్చాలని చూస్తున్నారని భట్టి.. ప్రభుత్వానికి ప్రతిపక్షాలు ప్రజా స్వామ్యయుతంగా సహకరించాలన్నారు.నిరుద్యోగుల కోసమే ప్రత్యేక తెలంగాణ ను తెచ్చుకున్నామన్న భట్టి.. రైతుల రూ.18వేల కోట్లు ఋణమాఫీ చేశామన్నారు. అన్ని వర్గాలకు ఉపయోగపడే కులగణనను కొంతమంది అడ్డుకునే ప్రయత్నం అవకాశం ఉంది. దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు గురించి కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న ఆయన దేశ స్వాతంత్రం కోసం నెహ్రు అనేక ఏళ్లు జైలు జీవితం గడిపాడన్నారు. కుల గణన విప్లవాత్మక నిర్ణయమని, దేశానికి తెలంగాణ రోల్ మోడల్ కాబోతుందని భట్టి ధీమా వ్యక్తం చేశారు. స్కీములు పెరగడానికి కులగణన చేస్తున్నామని స్పష్టం చేశారు. కుల గణన చేశామని మాట ఇచ్చామని, ఇచ్చిన మాటను చేసి చూపిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి కుల గణన ఎంతగానో ఉపయోగపడుతుందని. అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకునే ప్రశ్నలు తయారు చేశామన్నారు.