ముద్ర/వీపనగండ్ల :- గత పాలకులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి చిప్ప చేతికి ఇచ్చారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. వనపర్తి జిల్లా గోవర్ధనగిరి లో మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వారి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడుతూ.. గత బిఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ చుట్టూ ఉన్న విలువైన రింగ్ రోడ్డును 30 సంవత్సరాలకు లీజుకు ఇచ్చి రైతులకు రైతుబంధు ఇచ్చారని అన్నారు. గత పాలకులు చేసిన అప్పులకు కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీ కట్టడమే సరిపోతుంది అని సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోతున్నట్లు తెలిపారు. నేను మాట్లాడిన మాటలు నిజం కాదని బిఆర్ఎస్ నాయకులు నిరూపిస్తే రాజకీయం నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు.
కొన్ని రోజులు ఆలస్యమైనా ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీని పూర్తి స్థాయిలో అమలు చేయడం జరుగుతుందన్నారు. రైతు భరోసా పథకం కొంత ఆలస్యమైన రైతుల ఖాతాలో డబ్బులు జమ కావన్నారు. కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావు నియోజకవర్గాల్లో మాత్రమే కొందరికి మాత్రమే డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చి రాష్ట్రమంతా గొప్పలు చెప్పుకుంటున్నామని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టలో ప్రకటించిన విధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు, రైతు రుణమాఫీ, గృహ జ్యోతి పథకం కింద అర్హులైన ప్రతి ఒక్కరికీ 20 యూనిట్ల వరకు విద్యుత్ అందించడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోదల బీరయ్య, వనపర్తి జిల్లా ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు ఇంద్రకంటి వెంకటేష్, పానగల్ మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు బాల్ రెడ్డి,రైతు బంధు సమితి మండల మాజీ అధ్యక్షుడు ఏత్తం కృష్ణయ్య, నాయకులు నారాయణరెడ్డి, చక్ర వెంకటేష్,వెంకటస్వామి ఉన్నారు.