Home తాజా వార్తలు అమృత్ స్కాంతో సీఎం రేవంత్ రెడ్డి పదవి పోతుంది – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana

అమృత్ స్కాంతో సీఎం రేవంత్ రెడ్డి పదవి పోతుంది – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana

by Prajapalana
0 comments
అమృత్ స్కాంతో సీఎం రేవంత్ రెడ్డి పదవి పోతుంది - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • మంత్రి పొంగులేటి పదవికి కూడా ప్రమాదమే
  • ఇలాంటి కేసుల్లో చాలా శక్తివంతులు కూడా పదవులు పోగొట్టుకున్నారు
  • అన్ని వివరాలతో కేంద్రానికి ఫిర్యాదు చేశాం
  • అవినీతి చేసిన సీఎంపై విచారణ చేయకుంటే బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటేనని స్పష్టమవుతుంది
  • కాంగ్రెస్ కు ఏటీఎంగా తెలంగాణ
  • ఆర్ ఆర్ ట్యాక్స్ వసూల్ స్వయంగా ప్రధానే వస్తువు
  • తెలంగాణలో రోజుకో స్కాం బయట పెడుతాం
  • నా మీద ఏం కేసు పెడతారో పెట్టుకోండి
  • విచారణకు నేను సిద్ధం
  • బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

ముద్ర, తెలంగాణ బ్యూరో :- రాష్ట్రంలో జరిగిన అమృత్ స్కామ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిల పదవులు పోవడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇలాంటి కేసుల్లో చాలా శక్తివంతులు కూడా గతంలో పదవులు పొగొట్టుకున్న దాఖలాలు ఉన్నాయి. ఈ స్కాం పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సమగ్ర వివరాలతో ఫిర్యాదు చేశామన్నారు.మంగళవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి, ఇతర రాష్ట్రాల ఎన్నికలకు తెలంగాణ ఏటీఎంగా మారిందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై ప్రధాన మంత్రి మహారాష్ట్ర ఎన్నికల్లో మాట్లాడడం కాదు…. అవినీతిపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఒకవేళ అమృత్ టెండర్లలో ఎలాంటి అవినీతి జరగలేదు అంటే అదే మాటను బిజెపి నేతలు, ప్రధానమంత్రి దేశానికి చెప్పాలన్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది బిజెపి చిత్తశుద్ధికి ఒక లిట్మస్ పరీక్ష అని గుర్తించాలి. అమృత్ టెండర్లలో ముఖ్యమంత్రి, మంత్రుల కుటుంబ సభ్యులకే టెండర్లు ఇచ్చారని తెలిపారు. ఇంత అవినీతి జరుగుతున్నా మౌనంగా ఉండటం….చర్యలు తీసుకోకుండా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. కేంద్రం స్పందించకపోయినా రాష్ట్రంలో జరుగుతున్న అనేక అవినీతి కార్యక్రమాల పైన రాష్ట్ర ప్రభుత్వాన్ని…. ముఖ్యమంత్రిని బీఆర్ఎస్ పక్షాన ఎండగడుతూనే ఉంటామన్నారు. క్రోనీ క్యాపిటలిజం గురించి ఢిల్లీలో చెబుతున్న మాటలు రాహుల్ గాంధీని ఎండగడతామన్నారు.అమృత్ టెండర్ల పైన ఫిర్యాదు చేసిన సందర్భంగా కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ కట్టర్ ఈ అంశంలో విచారణ జరిపి…తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని కేటీఆర్ తెలిపారు. పార్లమెంట్ సమావేశాల వరకు సమయం ఇవ్వండి…. సమాచారం సేకరించి చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్రం ఒకవేళ పార్లమెంటు సమావేశాలలో ఈ టెండర్లలో అవినీతిపై స్పందించినట్లయితే రాజ్యసభలో ఈ సందర్భంగా లేవనెత్తుతామన్నారు.

రెండు పార్టీలు కలిసే ఉన్నాయి

రాష్ట్రంలో బిజెపి, కాంగ్రెస్ లు కలిసే ఉన్నాయని కేటీఆర్ అన్నారు. రేవంత్ పైన వచ్చే ప్రతి విమర్శకు కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించి కాపాడుతున్నాడని. రాష్ట్రంలో 8 ఎంపీలున్నా ఇప్పటిదాకా 11 నెలల్లో ఒక్కరు కూడా ప్రభుత్వ అవినీతిపై మాట్లాడిన మంది. ఏంపిలను, ఎమ్మెల్యేలను గొర్రెల మాదిరి కొంటున్నారు అన్న మల్లిఖార్జున ఖర్గే …….తెలంగాణలోని గోట్ మందిని చూడాలని స్వాగతిస్తున్నానని అన్నారు.రాష్ట్రంలో జరుగుతున్న గొర్రెల కొనుగోళ్లను చూడాలన్నారు. అసలు ఫిరాయింపులను మెడలు పెట్టిందే కాంగ్రెస్ అని.. తెలంగాణలో అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువ ఫిరాయింపులు జరుగుతున్నాయని…. విషయంలో ఖర్గే ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు.

మహారాష్ట్రకు తెలంగాణ సొమ్ము

మహరాష్ట్ర అబద్దాలతో ప్రజలను మోసం చేసిన రాహుల్ గాంధీ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఆ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలకు తెలంగాణ సొమ్ములు పోతున్నాయి. రాష్ట్ర ప్రజల రూ 300 కోట్లు మహారాష్ట్రలో అబద్దాల ప్రచారానికి రేవంత్ సర్కార్ సాయం చేస్తోందన్నారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హమీలకు నిధులు లేవంటున్న ప్రభుత్వం, చేయని హామీలు అమలుపైన ప్రచారం కోసం అడ్డగోలుగా వందల కోట్లతో ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.తెలంగాణలో రాహుల్ గాంధీ చెబుతుండడం సిగ్గుచేటన్నారు. వ్యక్తం చేశారు.

తెలంగాణలో హమీలు అమలు అయ్యాయో లేదో ఇక్కడి ప్రజలను అడిగిన మహరాష్ట్ర ప్రజలు అడిగి తెలుసుకోవాలని ఈ సందర్భంగా కేటీఆర్ సూచించారు. ముఖ్యమంత్రిని గ్రామంలో కూడా అడిగిన ప్రజలు హమీల అమలు వైపల్యాలను చెబుతారు. మహరాష్ర్ట ప్రజలు ప్రాంతీయ పార్టీలకే ఓటు వేయాలని కేటీఆర్. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపి ఓటు వేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఉత్తర ప్రదేశ్, బెంగాల్ వంటి రాష్ట్రాల్లో బిజెపిని అడ్డుకున్నది ప్రాంతీయ పార్టీలేనని అన్నారు. కాంగ్రెస్ కు బిజెపిని ఆపే శక్తి సహాయం. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులను ఎలక్షన్ కమిషన్ స్వయంగా నిర్వహించాలన్నారు. అప్పుడే తెలంగాణ డబ్బులు మహరాష్ట్రకి వెళ్లకుండా అడ్డుకోగలుగుతున్నాం .

నియోజకవర్గం ప్రజలకు విషం

బావమరిది కోసం అమృత్ టెండర్ల ద్వారా అమృతం పంచుతున్న రేవంత్ రెడ్డి కొడంగల్ ప్రజలకు విషం పంచినట్లు. అందుకే కొడంగల్ ప్రజల ఫార్మా కోసం లాఠీ చార్జీలు చేసి ఇబ్బందులు పెట్టి అరెస్టులు చేసి జైలుకు పంపుతున్నారు. తన అల్లుడి ఫార్మా కంపెనీ కోసం రేవంత్ రెడ్డి కొడంగల్ ప్రజలను బలిపెట్టి భూములు లాక్కుంటున్నాడు. ముఖ్యమంత్రి అడ్డగోలు విధానాల పైన ధన దాహం పైన కొడంగల్ ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. పోలీస్ రక్షణ లేకుండా ముఖ్యమంత్రి కొడంగల్ పోయే పరిస్ధితి తెలంగాణలో సహాయం.కలెక్టర్ ను కొట్టేపరిస్థితి, ఏపిలో ఎప్పుడు జరగవలసిన అవసరం. ఒకవైపు కలెక్టర్ తనపై దాడి జరగలేదంటూ స్వయంగా చెప్తున్నప్పుడు మరి కేసులెందుకు, అరెస్టులెందుకో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.

నాకేం భయం లేదు

నాపై ఎలాంటి కేసు పెట్టుకున్నా… విచారణలు చేసుకున్న నాకేం భయం లేదని కేటీఆర్ అన్నారు.ఐదు వారాల కింద తెలంగాణ పరీక్షలు చేసి మంత్రిపైన ఈడీ దాడులు చేసిందని…అయితే ఇప్పటి వరకు ఈడీ కనీసం ఒక్క మాట కూడా చెప్పండి. మంత్రి కూడా మాట్లాడాడు.… ఈడి దాడి తర్వతా అదానీ అదే మంత్రితో చర్చలు చేశారు కేటీఆర్ గుర్తు చేశారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech