సుధీర్ బాబు, షాయాజీ షిండే, సాయిచంద్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'మా నాన్న సూపర్ హీరో'. వి సెల్యులాయిడ్స్ బ్యానర్ పై సునీల్ బలుసు నిర్మించిన ఈ సినిమాకి 'లూజర్' వెబ్ సిరీస్ ఫేమ్ అభిలాష్ కంకర దర్శకుడు. అక్టోబర్ 11న థియేటర్లలో అడుగుపెట్టిన ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా పరవాలేదు అనిపించుకుంది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో అలరించడానికి సిద్ధమైంది. (జీ5లో మా నాన్న సూపర్‌హీరో)
'మా నాన్న సూపర్ హీరో' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని జీ5 సొంతం చేసుకుంది. ఈ నవంబర్ 15 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తాజాగా జీ5 ప్రకటించింది. థియేటర్లలో విడుదలైన ఐదు వారాలకు ఓటీటీలో అడుగుపెడుతున్న ఈ మూవీ ఎలాంటి స్పందనను తెచ్చుకుంటుందో చూడాలి.
'మా నాన్న సూపర్ హీరో' సినిమా కథ ఏంటంటే…
జానీ (సుధీర్ బాబు) పుట్టుకతోనే తల్లిని పోగొట్టుకుంటాడు. తండ్రి ప్రకాష్ (సాయిచంద్) చేయని తప్పుకి జైలు పాలవుతాడు. దీంతో జానీ అనాథాశ్రమంలో పెరగాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ అతన్ని శ్రీనివాస్ (షాయాజీ షిండే) దత్తత తీసుకుంటాడు. మొదట్లో జానీని బాగానే చూసుకుంటాడు. కానీ ఆ తర్వాత తన భార్య చనిపోవడం, ఆర్థికంగా చితికిపోవడంతో.. జానీ రాకను తన కుటుంబానికి అరిష్టంగా భావించి.. అతనిపై కోపం పెంచుకుంటాడు శ్రీనివాస్. కానీ జానీ మాత్రం శ్రీనివాస్ ని కన్న తండి కంటే ఎక్కువగా ప్రేమిస్తుంటాడు. ఇదిలా ఉండగా శ్రీనివాస్ ని ఒక రాజకీయనాయకుడు జైల్లో పెట్టిస్తాడు. అతన్ని రోజుల్లో కాపాడాలంటే 20 కోటి రూపాయలు సర్దాల్సి వస్తుంది. దీంతో ఆ బాధ్యతను జానీ తీసుకుంటాడు. మరో 20 ఏళ్ల తర్వాత జైలు నుంచి విడుదలైన ప్రకాష్ తన కొడుకుని వెతుక్కుంటూ వస్తాడు. పెంచిన తండ్రి శ్రీనివాస్ ని కాపాడుకోవడం కోసం జానీ ఏం చేశాడు? తన కొడుకు జానీని కన్న తండ్రి ప్రకాష్ కలుసుకున్నాడా? వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి.