- వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న అభివృద్ధి పనులపై వాస్తవాలు తెలుసుకోకుండా మాజీ మంత్రి హరీష్ రావు అబద్ధాలు మాట్లాడుతున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం దూరం కావడంతో రేవంత్ సర్కార్ పై తప్పుడు ఆరోపణలను హరీష్ రావు పేర్కొన్నారు. ''హరీష్ రావు అబద్దాలు మానుకో'' అని ఆమె సూచించారు. జగిత్యాల జిల్లా తొంబరావుపేట గ్రామంలో గ్రామపంచాయతీ భవన నిర్మాణ బిల్లుకు సంబంధించి 17 లక్షల పెండింగ్లో ఉన్నట్లుగా ఒక పత్రికలో కథనం రావటం.. దానిని కనీసం క్రాస్ చెక్ చేసుకోకుండానే మాజీ మంత్రి హరీష్రావు ట్వీట్ చేశారని మంత్రి సీతక్క దుయ్యబట్టారు.
నిత్యం మీడియా, సోషల్ మీడియాలో ఉండేందుకు పాకులాడుతూ.. తప్పుడు ప్రచారం చేయడాన్నే హరీష్ రావు పనిగా పెట్టుకున్నారని ఆమె ఉదయం. లేని అంశాలను ప్రజల భ్రమింప చేయడాన్ని హరీష్ రావు మానుకోవాల’ని సూచించారు. అవస్తవాలను ప్రచారం చేసి అధికారంలోకి వచ్చేందుకు హరీష్ ఆరాటపడుతున్నారని అన్నారు. తెలంగాణ సెంటిమెంట్ రాజకీయాలు లేకపోవడంతో అవస్తలు మాట్లాడటం హరీష్ రావు నైజామా అని ఆమె ప్రశ్నించారు. అధికారం దూరం కావడాన్ని తట్టుకోలేక ప్రజలకు అన్యాయం జరిగినట్లుగా హరీష్ రావు అవాస్తవాలతో మభ్యపెడుతున్నారని ఆమె గుర్తు చేశారు. గ్రామపంచాయతీలలో చేసిన పనులకు బిల్లులు తీసుకుని, బిల్లులు రాలేదని తప్పుడు ప్రచారం చేస్తే కేసులు పెడతామని మంత్రి సీతక్క సూచించారు.