21
- భారీగా ఎగిసి పడుతున్న మంటలు నేల మట్టమైన పరిశ్రమ.
- మంటలను అదుపు చేస్తున్న ఫైర్ అధికారులు…
- ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదంటున్న స్థానికులు…!
షాద్ నగర్, ముద్ర: రంగారెడ్డి జిల్లానందిగామ మండల కేంద్రాన్ని హిమాలయ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ (కాన్సన్) పరిశ్రమలో మంగళవారం అర్థరాత్రి ఒకసారిగా మంటలు చెలరేగాయి. పరిశ్రమలో నూతనంగా ఏర్పాటు చేసిన ఒక షెడ్డులో భారీ మంటలు ఎగిసిపడుతున్నాయి అందరూ చూస్తుండగానే క్షణాల్లో పూర్తిగా నేల మట్టం అయిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు తెలపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు షార్ట్ కారణమైందని సమాచారం.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.పరిశ్రమలోని మరో షెడ్డుకు మంటలు వ్యాపించకుండా ప్రయత్నిస్తున్నారు.దీనిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…