21
- సహాయకుడిగా బి.సైదులు
- హైకోర్టుతో డెడికేటెడ్ కమీషన్ను ఏర్పాటు చేసింది
ముద్ర, తెలంగాణ బ్యూరో : స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లకు సంబంధించి న్యాయస్థానాల సూచనల మేరకు డెడికేటెడ్ (ప్రత్యేక) కమిషన్ ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బూసాని వెంకటేశ్వర రావును కమీషన్ చైర్మన్ గా, మహాత్మ జ్యోతిబా పూలే బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి బీ సైదులు (ఐఎఫ్ఎస్) కమీషన్ కార్యదర్శిగా నియమించారు.
కులగణన, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ నెల 3న పలువురు మంత్రులు, అధికారులతో చర్చించిన రేవంత్ రెడ్డి.. 24 గంటల్లోగా డెడికేటెడ్ కమీషన్ ఏర్పాటు చేశారు. అయితే డెడికేటెడ్ కమీషన్ నెల రోజుల్లోగా తన రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది.