ముద్ర, తెలంగాణ బ్యూరో :- రేవంత్ ప్రభుత్వాన్ని అస్థిరం, అబాసు పాలు చేయాలన్న ఏకైక లక్ష్యం బీఆర్ఎస్ నేతల్లో కనిపిస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క. ఇందులో భాగంగానే మాజీ సర్పంచ్లను రెచ్చగొడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు బీఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచ్ లకు బిల్లులు ఇవ్వక వాళ్లతో బలవంతంగా పనులు చేయించింది. ఇలా సంవత్సరాల తరబడి బిల్లులు చెల్లించకుండా వారి ఆత్మహత్యలకు కారణమైంది.
అలాంటి బి ఆర్ ఎస్ ఇప్పుడు సర్పంచ్ లకు బిల్లులు చెల్లించాలని ఆందోళన చేయడం చంపినోడే తద్దినం పెట్టినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. సోమవారం సచివాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఆర్థిక శాఖ మంత్రిగా హరీష్ రావు ఉన్నప్పుడే బిల్లులు పెండింగ్ లో పెట్టారని మాజీ సర్పంచ్ లకు తెలుసు. అధికారంలో ఉన్నప్పుడు ఆత్మహత్య బిల్లులు చెల్లించకుండా వారికి కారణమైంది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. ఈ తప్పును కప్పిపుచ్చుకునేందుకు హరీశ్ రావు నగరంలో ఆందోళన పేరుతో డ్రామాలు ప్రదర్శించారు.
ఆర్థిక శాఖను అధికారాన్ని చేతిలో పెట్టుకొని సర్పంచ్ల ఆత్మహత్యలకు కారణమైందే ఆయన అని మంత్రి సీతక్క చేశారు.అధికారం పోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బహిష్కరించారు. అడ్డదారిలో అధికారంలోకి రావడానికి కుట్రలు పన్నడానికి అనుకూలంగా ఉంటాయి. నిజంగా బీఆర్ఎస్ నాయకులకు నీతి నిజాయితీ ఉంటే , సర్పంచ్ ల మీద ప్రేమ ఉంటే బిల్లులు ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించారు.మీరు పెండింగ్ లో పెట్టిన గ్రామీణ ఉపాధి హామీ బిల్లులతోపాటు ఇతర బిల్లులను చెల్లించుకుంటూ వస్తున్నామని.మీ హయాంలో పెండింగ్ లో రూ. 580 కోట్లకు పైగా బిల్లులను ఇప్పటికే చెల్లించామని వివరించారు.సర్పంచులతో మీరు బలవంతంగా పనులు చేయించి వందల కోట్లు పెండింగ్లో పెట్టడంతో వారు ఆత్మహత్య చేసుకున్నారు. ఎలాంటి ఆర్డర్స్ లేకుండా ఇష్టానుసారంగా పనులు చేయించారు. కేవలం స్వార్థ రాజకీయాల కోసమే హరీశ్ రావు, బిఆర్ఎస్ మాజీ సర్పంచులను వాడుకుంటున్నాం.