Home తెలంగాణ ఈ నెలాఖరు నుంచి రైతు భరోసా – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

ఈ నెలాఖరు నుంచి రైతు భరోసా – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
ఈ నెలాఖరు నుంచి రైతు భరోసా - Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • కనీసం రూ.7వేల కోట్లు అవసరం
  • నిధుల సర్దుబాటుపై ఆర్థిక శాఖకు సీఎం ఆదేశాలు
  • మొదట దసరా నుంచే అనుకున్నప్పటికీ రుణమాఫీకి నిధులివ్వడంతో వాయిదా
  • ఈ నెలలో ప్రారంభించి వచ్చే నెలలో పూర్తి చేయడానికి ఏర్పాట్లు
  • ఎప్పటిలాగే ఒక ఎకరా నుంచి పంపిణీ చేయడానికి ప్రణాళిక
  • గైడ్ లైన్స్ పై డ్రాఫ్ట్ నోట్ సిద్ధం చేసిన కేబినెట్ సబ్ కమిటీ
  • పది ఎకరాల వరకు? ఏడున్నర ఎకరాల వరకు?
  • అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వం

ముద్ర, తెలంగాణ బ్యూరో : రైతులకు పంట పెట్టుబడి సాయం (రైతు భరోసా)ను ఈ నెలాఖరు నుంచి పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. అందుకు అవసరమైన నిధులను సర్దుబాటు చేయడం, ఆ మేరకు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖను ఆదేశించినట్లు తెలిసింది. ఎప్పటిలాగే ఒక ఎకరా నుంచి మొదలుపెట్టాలని సూచించిన సీఎం డిసెంబర్ నెల వరకు రైతుల ఖాతాల్లో నిధులు జమా పూర్తి చేసినట్లు సమాచారం. వాస్తవానికి దసరా తర్వాత నుంచే రైతు భరోసా పంపిణీ చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ, ఇప్పటికే రుణమాఫీ కోసం రూ.18 వేల కోట్లు రైతులకు రిలీజ్ చేసింది. దానితో పాటు కార్మికులకు నిధులు సర్దుబాటు అవసరం వచ్చిందని ప్రభుత్వ వర్గాలు రైతుల విషయంలో ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వబోమని.. డిసెంబర్ నెలలో స్థానిక ఎన్నికల కంటే ముందే రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేసినట్లు చెప్పినట్లు సమాచారం. దీంతో అధికార యంత్రాంగమూ ప్రతి 10రోజులకు రూ.1,500 కోట్ల నుంచి రూ.2 వేల కోట్ల చొప్పున జమ చేసేలా 45 రోజుల్లోకనీసం రూ.7వేల కోట్లు జమ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. దాంతో ఇప్పుడున్న లెక్కల ప్రకారం ఏడెనిమిది ఎకరాల రైతులకు అంటే దాదాపు 96 శాతం మందికి రైతుభరోసా అందుతుంది.

దుబారా ఖర్చులు లేకుండా చర్యలు..!

రైతుబంధు స్కీమ్‌లో భారీగా నిధులు దుర్వినియో గమవుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. గత సర్కార్ హయాంలో.. రాళ్లు, రప్పలు భూములు, గుట్టలు, హైవేలు, రోడ్లు, వెంచర్లు, భూసేకరణ కింద పోయిన భూములకు వేల కోట్ల రూపాయలు రైతుభ రోసా కింద వృథాగా చెల్లించినట్లు తేల్చింది. 2018 నుంచి 2023 వరకు రాళ్లు రప్పలు, రోడ్లకు ఇతర త్రా వాటికి ఏకంగా రూ.25 వేల కోట్లు చెల్లించినట్లు గుర్తించారు. దాంతో రైతు భరోసాకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి.. దానిపై ఎన్ని ఎకరాలు ఇవ్వాలంటే జిల్లాల్లో సభలు నిర్వహించి అభిప్రాయ సేకరణ చేసింది. చాలామంది రైతులు 10 ఎకరాల వరకు పెట్టుబడి సాయం ఇస్తే సరిపోతుందని భావిస్తున్నారు. మరికొంత మంది రైతులు ఏడున్నర ఎకరాల వరకు అందించేలా అందరి అభిప్రాయాలు తీసుకున్న కేబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే లిమిట్ ఎంతవరకు పెట్టాలనే దానిపై మార్గదర్శకాలకు సంబంధించిన డ్రాప్ట్ నోట్ ను సిద్దం చేసింది. ఈ మార్గదర్శకాలపై త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క చర్చించారు.

రైతులు, రైతు సంఘాలు, వివిధ పార్టీల అభిప్రాయాలు ఇప్పటికే తెలుసుకున్నందున.. అవసరమైతేనే అసెంబ్లీలో చర్చించాలని ప్రభుత్వం కోరుతోంది. అసెంబ్లీ సమా వేశాలను కూడా ఈ నెల మొదటివారంలో నిర్వహిం చాలని అనుకున్నప్పటికీ శాసనమండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్ విదేశీ పర్యటనతో వారు తిరిగిరాగానే అసెంబ్లీ సమావేశాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. దానికి తగ్గట్టు రైతు భరోసా మార్గదర్శకాలపై చర్చించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఎట్టిపరిస్థితుల్లోనూ వ్యవసాయేతర భూములకు రైతుభరోసా ఇవ్వొద్దని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయ భూముల్లో వెంచర్లు చేసి ప్లాట్లుగా మార్చిన వాటికి నాలా కిందనే పరిగణించాలని అధికారులను ఆదేశించారు. రోడ్లు, ఇరిగేషన్, ఇండ్లు ఇతరత్రా వ్యవసాయ భూములకు మళ్లిన వాటిని రైతు భరోసా జాబితా నుంచి తీసేయాలని అధికారులు సూచించారు. దాంతో చాలా వరకు నిధుల దు ర్వినియోగం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. రాష్ట్ర వ్యవసాయ శాఖ సాగు లెక్కల ప్రకారం 1.39 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. దుబారాను కట్టడి చేస్తే.. పెట్టుబడి సాయం కోసం దాదాపు రూ.7వేల కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech