Home ఆంధ్రప్రదేశ్ జగన్, షర్మిల వివాదంలోకి మాజీ మంత్రి బాలినేని.. విజయమ్మ రంగంలోకి దిగాలని సూచన – Prajapalana News

జగన్, షర్మిల వివాదంలోకి మాజీ మంత్రి బాలినేని.. విజయమ్మ రంగంలోకి దిగాలని సూచన – Prajapalana News

by Prajapalana
0 comments
జగన్, షర్మిల వివాదంలోకి మాజీ మంత్రి బాలినేని.. విజయమ్మ రంగంలోకి దిగాలని సూచన


ఆస్తి వివాదం నేపథ్యంలో కొద్ది రోజుల నుంచి తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సోదరి షర్మిల వివాదంలోకి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వచ్చారు. షర్మిలను వైసీపీకి చెందిన ముఖ్యనేతలుగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో.. షర్మిలకు అండగా ఉండేలా మాజీ మంత్రి బాలినేని జగన్మోహన్ రెడ్డి. హైదరాబాదులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన సోమవారం మాట్లాడారు. దివంగత నేత వైయస్సార్ కుటుంబం ఆస్తుల కోసం తగాదాలూ పడడం బాధాకరమన్నారు. ఆడబిడ్డ కన్నీరు ఆ ఇంటికి అరిష్టమని ఈ సందర్భంగా బాలినేని నటించారు. వీరిద్దరి మధ్య నెలకొన్న సమస్యను పరిష్కరించేందుకు వైయస్ విజయమ్మ ముందుకు రావాలని. వేరే వాళ్ళు జోక్యం చేసుకోవద్దంటూ బాలినేని. ఈ విషయంలో సీఎం చంద్రబాబుపై విమర్శలు చేయడం సరికాదన్నారు. తాను ఏ పార్టీలో ఉన్న వైయస్సార్ కుటుంబం బాగుండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. తాను కొత్తగా ఆస్తులు సంపాదించుకోవాల్సిన అవసరం ఉందని బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తన కుమారుడి సాక్షిగా చెబుతున్నానని, వైసీపీలో ఉన్నప్పుడు తన ఆస్తులు పోగొట్టుకున్నాను తప్ప సంపాదించుకోలేదని స్పష్టం చేశారు. ఆ విషయం జగన్ మోహన్ రెడ్డికి కూడా తెలుసు అన్నారు. తనకు సంస్కారం ఉందని కాబట్టే తన గురించి ఎంత ప్రచారం చేస్తున్నానో మాట్లాడలేదని స్పష్టం చేశారు. అప్పులయితే తన తండ్రి, కోడలు ఆస్తి ఆమె తీర్చానని, ఇది జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. డిప్యూటీ సీఎం ను కలిసినప్పుడు ఎన్నికలకు ముందే పవన్ పార్టీలోకి తీసుకెళ్తామని అనుకున్నట్లు చెప్పారని, కానీ జగన్ కు బంధువులు కదా అని అడగలేకపోయారని పవన్ ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ తన గురించి ఎప్పుడూ హుందా గానే మాట్లాడారని, వైసీపీలో బాలినేని వంటి మంచి నేతలు ఉన్నారని అప్పట్లోనే చెప్పారు. జగన్ ఒంగోలు వచ్చి కూడా ఇళ్ల పట్టాల విషయంలో తన గురించి ఒక్క మాట కూడా చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి పదవిని వదులుకొని జగన్ వెంట నడిచానని, ఆ పార్టీలో తనకు ఏం జరిగిందో ప్రజలకు తెలుసు. వైయస్ కుటుంబంలో నెలకొన్న వివాదంతో తాను బాధపడుతున్నట్లు స్పష్టం చేశారు. అన్నా, చెల్లెల మధ్య నెలకొన్న సమస్యను తల్లి విజయమ్మ మధ్యవర్తిత్వం చేసి పరిష్కరించే ప్రయత్నం చేయాలన్నారు. తనపై చేస్తున్న విమర్శలను తాను పెద్దగా పట్టించుకోనని స్పష్టం చేశారు.

ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు శుభవార్త.. బీసీ స్టడీ సర్కిల్స్ లో ఇకపై ఉచిత శిక్షణ
చర్లపల్లి రైల్వే స్టేషన్ | ఎయిర్‌పోర్టులను తలపించేలా చర్లపల్లి రైల్వే స్టేషన్

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech