- డ్రగ్స్ శాంపుల్స్ నిరాకరించిన మహిళలు
- డ్రగ్ ఫ్లడ్లర్ల తీగ లాగుతున్న నార్కోటిక్ పోలీసులు
- రాజ్, విజయ్ డ్రగ్స్ తీసుకున్నారు: పోలీసులు
ముద్ర, తెలంగాణ బ్యూరో : జన్వాడ ఫామ్ హౌస్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రేవ్ పార్టీలో కొకైన్ తీసుకున్న విజయ్ మద్దూరిని విచారించిన మోకిలా పోలీసులకు ఆయన కీలక విషయాలు వెల్లడించారు. రాజ్ పాకాల వద్ద నుంచే తాను కొకైన్ తీసుకొని సేవించినట్లు విజయ్ మద్దూరి అంగీకరించాడు. ఈ కేసులో విజయ్ ఇచ్చిన వాంగ్మూలం కీలకంగా మారింది. అయితే రాజ్ పాకాలకు కొకైన్ ఎలా వచ్చింది.? ఎవరు వద్ద నుంచి వచ్చింది.? ఎవరు విక్రయించారు.ఆ పార్టీలో ఇంకా ఎవరెవరు అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా తన నూతన ఫామ్‌హౌస్‌లో దీపావళి పార్టీ కోసం రాజ్‌పాకాల తనను పిలిచాడని పోలీసులకు తెలిపిన విజయ్.. కొకైన్ అధికారి రాజ్ పాకాల తనతో చెప్పినట్లు పోలీసులకు తెలిపారు.
వీకెండ్‌లో తరచూ రాజ్ పాకాల పార్టీలు నిర్వహించేవారని. వీకెండ్స్‌లో రాజ్ పాకాల ,విజయ్ మద్దూరి ఇద్దరు కలిసి డ్రగ్స్ పార్టీలు చేసుకునే వారని మోకిలా పోలీసులు గుర్తించారు. ఇదీలావుంటే రేవ్ పార్టీలో మహిళలు డ్రగ్స్ షాంపులు ఇచ్చేందుకు నిరాకరించారని మోకిలా పోలీసులు తెలిపారు. అందుకే కేవలం పురుషుల నుంచి నమూనాలు సేకరించినట్లు వివరించారు. మరోవైపు..పరారీలో ఉన్న ఫాం హౌస్ యజమాని రాజ్ పాకాల పోలీసుల విచారణకు గైర్హాజరయ్యారు. ఆదివారం రెండు చోట్ల విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఉదయం 10 గంటలకు ఎక్సైజ్ కార్యాలయం, 2గంటలకు మోకిలా పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసుల విచారణకు సహకరించాల్సిన ఆయన రెండు చోట్లా డుమ్మా కొట్టారు. మొబైల్ స్విచ్ఛాఫ్ తీసుకున్నారు. అయితే రాజ్ పాకాల కోసం 24 గంటలు చూసి వారెంట్ జారీ చేశారు మోకిలా పోలీసులు. కాగా రాజ్ పాకాల రెండు సాఫ్ట్‌వేర్ కంపెనీలకు సీఈఓగా ఉన్నారు. ఆయనకు చెందిన మరో ఈటీజీ కంపెనీకి విజయ్ మద్దూరి సీఈఓగా పని చేస్తున్నారు.
ఫామ్‌హౌస్ రైడ్‌లో 40 మంది ఉన్నారు: కమల్ హాసన్ రెడ్డి
సైబరాబాద్ పోలీసులతో కలిసి ఎక్సైజ్ పోలీసులు ఈనెల 27వ తేదీ తెల్లవారు జామున జైంట్ ఆపరేషన్ నిర్వహించినట్లు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కమల్ హాసన్ రెడ్డి తెలిపారు. రాజ్ పాకాల ఫామ్‌హౌస్‌పై రైడ్ చేశామని వివరించారు. ఈ పార్టీలో 40 మంది పాల్గొన్నారు. వీరిలో 18 మంది మహిళలు ఉన్నారు. 12 ఇంటెడ్ బాటిళ్లు, న్యూఢిల్లీ నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ మద్యం బాటిళ్లు, మహారాష్ట్ర నుంచి ఎన్డీపీఎల్ మద్యం బాటిళ్లు, 11 ఆల్ట్రా బీర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ పార్టీని రాజ్ పాకాల నిర్వహించారని అన్నారు. ఎక్సైజ్ శాఖ లేకుండా ఎలాంటి అనుమతులు ఈ పార్టీ నిర్వహించారని తెలిపారు. పార్టీలో నాన్ డ్యూటీ పీయిడ్ లిక్కర్ మద్యం సర్వ్ చేశారన్నారు. ఎక్సైజ్ నిబంధనలను ఉల్లంఘించి ఈ రెండు నేరాలకు చేర్చారు. ఈ విషయంపై చేవెళ్ల ఎక్సైజ్ పోలీస్ స్టేషనులో కేసు నమోదు చేశామని చెప్పారు. ఈ రెండు నేరాలపై ఎక్సైజ్ యాక్ట్ 34(a),34(1),,9(1) కింద కేసులను నమోదు చేశామని కమల్ హాసన్ రెడ్డి పేర్కొన్నారు.