Home తెలంగాణ మంత్రి కొండా సురేఖపై దాఖలు చేసిన పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టులో కేటీఆర్ వాంగ్మూలం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

మంత్రి కొండా సురేఖపై దాఖలు చేసిన పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టులో కేటీఆర్ వాంగ్మూలం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
మంత్రి కొండా సురేఖపై దాఖలు చేసిన పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టులో కేటీఆర్ వాంగ్మూలం - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • కొండా సురేఖ వ్యాఖ్యలు నాతో పాటు పార్టీకి నష్టం కలిగించాయి
  • ఆమె మాట్లాడిన కొన్ని మాటలు తీవ్ర ఆవేదన కలిగించాయి. వాటిని చెప్పలేకపోతున్నా.
  • నేను డ్రగ్ అడిక్ట్ అని, రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నానంటూ పబ్లిసిటీ కోసమే దిగజారుడు ఆరోపణలు చేశారు.
  • కేటీఆర్, దాసోజు శ్రవణ్ స్టేట్ మెంట్ రికార్డు చేసిన కోర్టు.
  • మిగిలిన సాక్షుల వాంగ్మూలాన్ని ఈ నెల 30న రికార్డ్ చేయనున్న నాంపల్లి కోర్టు.

ముద్ర, తెలంగాణ బ్యూరో :- మంత్రి కొండా సురేఖ పై దాఖలు చేసిన పరువు నష్టం కేసులో బుధవారం నాంపల్లి కోర్టులో కేటీఆర్ వాంగ్మూలం ఇచ్చారు. ఆమె వ్యాఖ్యలు తనతో పాటు పార్టీకి కూడా తీవ్రంగా నష్టం చేకూర్చే విధంగా ఉన్నాయని కోర్టులో కేటీఆర్ స్టేట్ మెంట్ ఇచ్చారు. తనపై కొండా సురేఖ చేసిన కామెంట్లను చూసి సాక్షులు తనకు ఫోన్ చేశారన్నారు. కొండా సురేఖ వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయని వాటిని విని షాక్ అయ్యానని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షులు తనకు 18 ఏళ్లుగా తెలుసని వారు కూడా ఈ వ్యాఖ్యలు విని చాలా బాధపడ్డారని చెప్పారు.

బాధ్యత గల పదవిలో ఉండి అత్యంత దిగజారుడు వ్యాఖ్యలను కొండా సురేఖ చేశారని కేటీఆర్ తన వాంగ్మూలంలో తెలిపారు. ఆమె మాట్లాడిన మాటలు కొన్ని చెప్పలేని విధంగా తీవ్ర ఆవేదన కలిగించేలా ఉన్నాయని కోర్టుకు చెప్పారు. నేను డ్రగ్ అడిక్ట్ అని, రేవంత్ పార్టీలు నిర్వహించానని ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం పబ్లిసిటీ కోసమే కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారన్నారు. ఆమె చేసిన అన్ని విషయాలు చెప్పలేకపోతున్నానని ఫిర్యాదులో ఉన్న వ్యాఖ్యలు పరిగణలోకి కేటీఆర్ కోర్టును నమోదు చేసింది. దాదాపు అరగంట పాటు కోర్టులో కేటీఆర్ తన వాంగ్మూలాన్ని ఇచ్చారు. కొండా సురేఖ చేసిన కామెంట్ల వీడియోలను ఈ సందర్భంగా కోర్టుకు సమర్పించారు. కేటీఆర్ తో పాటు సాక్షిగా ఉన్న దాసోజు శ్రవణ్ స్టేట్ మెంట్ ను కూడా కోర్టులో నమోదు చేసుకుంది. మిగిలిన సాక్షుల స్టేట్ మెంట్లను రికార్డ్ ను కోర్టు ఈ నెల 30 కి వాయిదా వేసింది.

గతంలోనూ కేటీఆర్ పై కొండా సురేఖ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అప్పుడు ఎన్నికల సంఘం ఆమె తీరుపై మండిపడింది. అయినప్పటికీ కొండా సురేఖ తీరులో ఎలాంటి మార్పు రాలేదు. మళ్లీ అవే ఆరోపణలు చేయడంతో బేషరతుగా క్షమాపణ చెప్పాలని కేటీఆర్ ఆమెకు లీగల్ నోటీసులు ఇచ్చారు. మంత్రి నుంచి ఎలాంటి సమాధానం రాకపోతవంతో కొండా సురేఖ పై పరువు నష్టం దావా కేసును కేటీఆర్ ఫైల్ చేశారు. ఈ నెల 21 నే స్టేట్ మెంట్ రికార్డ్ చేయాల్సి ఉంటుంది కేటీఆర్ అభ్యర్థన మేరకు గురువారం వరకు కోర్టు సమయమిచ్చింది. ఇవ్వాళ మధ్యాహ్నం 3.30 గంటలకు తెలంగాణ భవన్ నుంచి కేటీఆర్ సహా ఈ కేసులో సాక్షులుగా ఉన్న దాసోజు శ్రవణ్, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, బాల్క సమన్, మాజీ మంత్రి జగదీష్ తో పాటు బీఆర్ఎస్ నేతలు నాంపల్లి కోర్టుకు బయలుదేరారు. కేటీఆర్, దాసోజు శ్రవణ్ ల వాంగ్మూలాన్ని కోర్టులో నమోదు చేసుకుంది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech