Home సినిమా ప్రభాస్ అంటే అందరికీ ఇష్టమే.. మరి అతని ఇష్టాలేమిటో తెలుసా? – Prajapalana News

ప్రభాస్ అంటే అందరికీ ఇష్టమే.. మరి అతని ఇష్టాలేమిటో తెలుసా? – Prajapalana News

by Prajapalana
0 comments
ప్రభాస్ అంటే అందరికీ ఇష్టమే.. మరి అతని ఇష్టాలేమిటో తెలుసా?


ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్‌రాజు… ఈ పేరు చెబితే ఎవరూ గుర్తు పట్టకపోవచ్చు. కానీ, ప్రభాస్ అంటే తెలియని వారు ఇప్పుడు ప్రపంచంలోనే లేరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే 'బాహుబలి' సిరీస్‌ నుంచి 'కల్కి 2898ఎడి' చిత్రం వరకు అతను చేసిన సినిమాలే దానికి కారణం. టాలీవుడ్‌లోనే కాదు, ఇండియాలో ఉన్న టాప్ హీరోలందరిలోనూ ప్రభాస్‌కి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. తొలి సినిమా 'ఈశ్వర్‌' రిలీజ్‌ అయిన ప్రభాస్‌పుడు బిహేవియర్‌ ఎలా ఉందో.. ఇప్పుడు 'కల్కి' సినిమా రిలీజ్‌ అయిన తర్వాత కూడా అలాగే ఉంది. ఇండియాలోనే టాప్ హీరోగా వెలుగొందుతున్నప్పటికీ ఏమాత్రం గర్వం లేకుండా ఎంతో సింపుల్‌గా కనిపించడం, తొలిరోజుల్లో కనిపించిన చిరువ్వుతోనే అందర్నీ పలకరించడం ఆయనకు పుట్టుకతోనే అబ్బింది. రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు నట వారసుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్‌ అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ప్రభాస్ అంటే అందరికీ ఇష్టమే. మరి ప్రభాస్‌కి ఇష్టమైనవి ఏమిటి, అతని అభిరుచులు ఏమిటి, ఖాళీ సమయాల్లో అతను ఏం చేస్తాడు? అతని బాల్యానికి సంబంధించిన విశేషాలు ఏమిటి? అనేది డార్లింగ్ పుట్టినరోజు సందర్భంగా తెలుసుకుందాం.

ప్రభాస్‌కుమార్‌కి ఇష్టమైన డైరెక్టర్‌ రాజ్‌హిరానీ. ఆయన డైరెక్షన్‌లో వచ్చిన 'మున్నాభాయ్‌ ఎంబిబిఎస్‌', '3 ఇడియట్స్‌' చిత్రాలను లెక్కలేనన్ని సార్లు చూశారు. ప్రభాస్‌కి ఇష్టమైన కలర్స్.. బ్లాక్ అండ్ వైట్. ఏదైనా ఫంక్షన్‌కిగానీ, ఈవెంట్‌కి గానీ హాజరు కావాలంటే.. ఈ రెండు కలర్స్‌లో ఏదో ఒకటి ప్రింట్ చేస్తారు. అలాగే ప్రభాస్‌ మంచి భోజనప్రియుడు. అతనే కాదు, కృష్ణంరాజుతోపాటు అతని ఫ్యామిలీలోని అందరూ భోజనప్రియులే. ఇతరులకు వడ్డించే విషయంలోనూ ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది ఆ కుటుంబం. ముఖ్యంగా ప్రభాస్.. అతిథి మర్యాదలకు పెట్టింది పేరు. ప్రభాస్‌ ఫుడ్‌ పెట్టి మరీ చంపేస్తాడు అంటూ ఎన్టీఆర్‌, పృథ్విరాజ్‌ సుకుమారన్‌ వంటివారు ప్రశంసించడమే దానికి ఉదాహరణ. ప్రభాస్ సినిమా జరుగుతున్నప్పుడు ఆర్టిస్టులకు, టెక్నీషియన్స్‌కి అతని ఇంటి నుంచే భోజనాలు వస్తాయి. ప్రభాస్‌కి చాక్లెట్ అంటే మహా ఇష్టం. చివరికి ఐస్‌క్రీమ్ కూడా చాక్లెట్‌దే అయివుండాలి.

ప్రభాస్‌కి ఇష్టమైన స్పోర్ట్‌ వాలీబాల్‌. తనకు టైం దొరికినపుడు వాలీబాల్ ఆడుతుంటారు. దానికి వీలుగా తన ఇంటి ఆవరణలోనే ఒక వాలీబాల్‌ కోర్టును కూడా ఏర్పాటు చేసుకున్నారు. ప్రభాస్‌కి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. అందుకే తన ఇంటిలోనే ఓ చిన్నపాటి లైబ్రరీని ఏర్పరుచుకున్నారు. ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదువుతూ టైం పాస్‌ చేస్తుంటారు. ప్రభాస్ బద్ధకస్తుడనే పేరు ఉంది. ఈ స్వయంగా రాజమౌళి చెప్పడం విశేషం. ఏ పని చెయ్యాలన్నా తర్వాత చూద్దాంలే అని వాయిదా వేస్తూ ఉంటారట. అయితే సెట్స్‌లో పూర్తి రివర్స్‌గా ఉంటుంది. సినిమా కోసం ప్రభాస్ ఎంత కష్టమైనా పడతారు.

చెన్నయ్‌లోని డాన్‌బాస్కో స్కూల్‌లో చదివేరోజుల్లో ప్రభాస్‌ ఒక టీచర్‌ని బాగా ఇష్టపడేవారు. అదే అతని మొదటి క్రష్. ఆ టీచర్ మొహం ఇప్పటికీ తనకు గుర్తుందని చెబుతారు ప్రభాస్. అతనికి కవితలంటే ఎంతో ఇష్టం. అయితే కవితలు రాయడం అతనికి తెలీదు. అందుకే టీనేజ్‌ టైం‌లో ఎవరైనా అమ్మాయి నచ్చితే మంచి కొటేషన్స్‌లో వున్న గ్రీటింగ్‌ కార్డ్స్‌కి తీసుకెళ్లి ఇచ్చేవారట. తమది క్షత్రియుల వంశం కావడం వల్ల మహారాజులు ధరించడం అంటే ప్రభాస్‌కి చాలా ఇష్టం. అలాంటి దుస్తులు ధరించాలని చిన్నప్పటి నుంచీ. ఆ కోరిక బాహుబలితో తీరిందట.


You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech