Home తాజా వార్తలు మూడు నెలల్లో భవనం అసెంబ్లీ ప్రాంగణంలోకి రానున్న కౌన్సిల్ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana

మూడు నెలల్లో భవనం అసెంబ్లీ ప్రాంగణంలోకి రానున్న కౌన్సిల్ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana

by Prajapalana
0 comments
మూడు నెలల్లో భవనం అసెంబ్లీ ప్రాంగణంలోకి రానున్న కౌన్సిల్ - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


  • పరిశీలించిన మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు

ముద్ర, తెలంగాణ బ్యూరో : అసఫ్ జాహీల నిర్మాణశైలితో ఉన్న అసెంబ్లీ పాత భవనాన్ని.. అదే నిర్మాణ కౌశలంతో అద్భుతంగా పునరుద్ధరిస్తున్న రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చెప్పారు. మంగళవారం అసెంబ్లీ ప్రాంగణం హెరిటేజ్ భవనమైన పాత అసెంబ్లీ భవన పునర్నిర్మాణంపై స్పీకర్ ఛాంబర్‌లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వైస్ ఛైర్మన్ బండా ప్రకాష్‌తో కలిసి భవన నిర్మాణ పనులపై సమీక్షించారు. భవనాన్ని పునర్నిర్మిస్తున్న ఆగాఖాన్ ప్రతినిధులు, ఆర్ అండ్ బీ అధికారులు మరియు అసెంబ్లీ సెక్రటరీ నర్సింహాచార్యులుతో మంత్రులు సమీక్షించారు. రాబోయే రెండు మూడు నెలల్లో భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని, ఎక్కడా చారిత్రక వైభవానికి ఇబ్బందులు లేకుండా భవనాన్ని సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దాలని ఆగాఖాన్ ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు.

భవనానికి కావాల్సిన ఎలక్ట్రిఫికేషన్ వ్యవస్థ మరియు నిర్మాణ పనులపై టెండర్లు పిలవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆర్ అండ్ బి స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచందనకు ఆదేశాలు జారీ చేశారు. ఆగాఖాన్ ట్రస్ట్ కు సంబంధించిన పెండింగ్ లో ఉన్న రూ. 2 కోట్ల రూపాయల నిధుల సమావేశం నుంచే ఉపముఖ్యమంత్రితో మాట్లాడి.. అప్పటికప్పుడే విడుదల చేశారు. బిల్లుల కోసం ప్రజోపయోగమైన పనులు ఆపొద్దని అధికారులకు సూచించిన మంత్రి.. ఏదైనా బిల్లులు పెండింగ్‌లో ఉంటే తనకు గానీ సహచర మంత్రి శ్రీధర్ బాబుకు చెప్పినా వెంటనే నిధులు విడుదల అయ్యేలా చూస్తామని చెప్పారు. ఈ హెరిటేజ్ భవనం అందుబాటులోకి వస్తే కౌన్సిల్ హాల్ ను అసెంబ్లీ భవనంలోకి మార్చితే.. పార్లమెంట్ తరహాలో వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే ప్రజలకు అసెంబ్లీ మరింత చెరువవుతుందని తెలిపారు. పార్కింగ్, సెక్యూరిటీ సిబ్బందికి ప్రత్యేక గదులు నిర్మించాల్సిన అవసరం ఉందని ఆదేశాలు జారీ చేశారు.

అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ పనులు వేగంగా సాగేందుకు ప్రత్యేకంగా ఒక ఎస్ఈ స్థాయి అధికారిని నియమించి పనులను పర్యవేక్షించాలని ఆర్ అండ్ బీ స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచందనకు సూచించారు. పనుల్లో అలసత్వానికి తావులేకుండా చేయాలని సూచించారు. లోక్ సభ, రాజ్యసభ లో ఉన్నట్టుగానే అసెంబ్లీ భవన ప్రాంగణంలో సెంట్రల్ హాల్ ను కూడా అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన చెప్పారు. ఐటీ శాఖ ద్వారా అసెంబ్లీకి అవసరమైన నెట్ వర్కింగ్ సేవలను కావాల్సిన ప్రతిపాదనలు పంపిస్తే వెంటనే ఆమోదం తెలుపుతానని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech