- ఎక్స్ వేదికగా రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్
ముద్ర, తెలంగాణ బ్యూరో :-హైదరాబాద్ లోని మలక్ పేట్ లో అక్టోబర్ లో శంకుస్థాపన చేసిన ఐటీ పార్కు పనులు ఒక్క అంగుళం కూడా ముందుకు కదలకపోవటం బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతున్నప్పటికీ ఇప్పటివరకు ఐటీ టవర్ పనులను పట్టించుకోకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు.
మలక్‌పేట్, సైదాబాద్, సంతోష్‌నగర్, దిల్సుఖ్నగర్ సహా రాష్ట్ర యువత దాదాపు 50 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించాలన్నది ఈ ఐటీ పార్క్ లక్ష్యమన్నారు. ఇందులో భాగంగానే అక్టోబర్ లో ఐటీ మంత్రిగా తానే శంకుస్థాపన చేశానని కేటీఆర్ మంగళవాం ఎక్స్ వేదికగా ఏర్పాటు చేశారు. మూడేళ్లలో ఈ ఐటీ పార్క్‌ను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాం….. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఐటీ పార్క్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని అన్ని ప్రాంతాల ఐటీని విస్తరించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసింది. ఆ ప్రయత్నాలను ప్రస్తుత ప్రభుత్వం కొనసాగించాలని ఐటీ మంత్రి శ్రీధర్ బాబును కోరుతున్నట్లు పేర్కొన్నారు