Home తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థుల డిమాండ్లను సానుకూలంగా పరిశీలించాలి – కేటీఆర్ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థుల డిమాండ్లను సానుకూలంగా పరిశీలించాలి – కేటీఆర్ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థుల డిమాండ్లను సానుకూలంగా పరిశీలించాలి - కేటీఆర్ - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


  • అరెస్ట్ చేసిన అభ్యర్థులను వెంటనే విడుదల చేయాలి
  • వారిపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలి
  • అభ్యర్ధులకు బీఆర్ఎస్ తరపున అండగా ఉంటాం
  • భరోసా ఇచ్చిన కేటీఆర్

ముద్ర, తెలంగాణ బ్యూరో :- మెయిన్స్ ఎగ్జామ్స్ ను రీషెడ్యూల్ గ్రూప్ చేయాలని కోరుతున్న అభ్యర్థుల డిమాండ్ ను సానుకూలంగా పరిశీలించాలని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని నిర్ణయించారు. అభ్యర్థులే ఎగ్జామ్ ను రీ షెడ్యూల్ చేయాలని కోరిన ప్రభుత్వం ఎందుకు మొండి పట్టుదలకు పోతోందని ప్రశ్నించారు. ఎగ్జామ్స్ రీ షెడ్యూల్ చేయాలంటూ అశోక్ నగర్ లో ఆందోళన చేపట్టిన అభ్యర్థులను ఈ సందర్భంగా ఆయన ఖండించారు. తక్షణమే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే వారిపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలన్నారు.

గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్ ను రీషెడ్యూల్ చేయాలంటూ పోరాటం చేస్తున్న అభ్యర్థులతో తెలంగాణ భవన్ లో గురువారం కేటీఆర్ సమావేశమయ్యారు. తమకు అండగా నిలవాలంటూ గ్రూప్ వన్ మెయిన్స్ అభ్యర్థులు ట్విట్టర్ లో కోరడంతో తెలంగాణ భవన్ లో వారితో కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాన ప్రతిపక్షంగా గ్రూప్ వన్ మెయిన్స్ అభ్యర్థుల పోరాటానికి అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు. వారికి కావాల్సిన న్యాయ సహాయాన్ని అందిస్తామన్నారు. ఈ సందర్భంగా ఎగ్జామ్స్ విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న మొండి వైఖరిని అభ్యర్థులు కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 29 రాజ్యాంగ విరుద్ధంగా. రిజర్వేషన్ల విషయంలోనూ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని చెప్పారు.

గ్రూప్ వన్ మెయిన్స్ కు సంబంధించి దాదాపు 22 కేసులు కోర్టులో ప్రభుత్వం మొండిగా పరీక్షలు నిర్వహించాలని చూస్తోందని కేటీఆర్ కు వివరించారు. తాము సుప్రీంకోర్టుకు వెళ్తే కోర్టు కచ్చితంగా ఎగ్జామ్స్ రద్దు చేస్తుందన్నారు. రద్దయ్యే ఎగ్జామ్స్ నిర్వహించడం సరికాదని చెబుతున్నప్పటికీ ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్తుంది. న్యాయపరమైన సమస్యలన్నీ తీరిన తర్వాత ఎగ్జామ్స్ నిర్వహించాలని కోరుతూ ప్రభుత్వం పట్టించుకోవటం లేదంటూ అభ్యర్థులు తమ ఆవేదనను కేటీఆర్ కు చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ పరంగా వారికి అండగా ఉంటామని కేటీఆర్ ధైర్యం చెప్పారు. న్యాయపరంగా కావాల్సిన సాయం అందిస్తామన్నారు. అదే విధంగా ఎగ్జామ్స్ ను రీ షెడ్యూల్ కోసం ప్రభుత్వం ఒత్తిడి పెంచుతామని చెప్పారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech