- వారికి సీఎం రేవంత్ సమయం ఇచ్చారు
- అక్రమ నిర్మాణాల విషయంలో పక్షపాతం ఉండదు
- ఎంఐఎంకు మోదీ అండ
- ఔరంగాబాద్ లో ఎంఐఎం ర్యాలీకి కార్పెట్ అందుకే
- ముందు బీఆర్ఎస్ లో అపోజిషన్ నేత ఎవరో చెప్పాలి
- కేసీఆర్,కేటీఆర్ ,హరీష్ రావులకు డీఎస్సీ,గ్రూప్-1 అంటే తెలియదు
- గాంధీభవన్ లో మీడియాతో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ చిట్ చాట్
ముద్ర, తెలంగాణ బ్యూరో :హైడ్రా కూల్చివేతలపై కేటీఆర్ దుష్ప్రచారానికి తెరలేపారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ వ్యక్తులు. నగరం, శివారు ప్రాంతాల్లోని చెరువులు, కుంటల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసి.. నీటి వనరులను కాపాడే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ పై డబ్బులు వెదజల్లి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు. బుధవారం లో మీడియాతో మాట్లాడిన ఆయన హైడ్రా కూల్చివేతల విషయంలో ఎవరికీ గాంధీ మినహాయింపు అందించారు. ఎంఐఎం అధినేత ఓవైసీ మాత్రమే కాదు బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందిన విద్యా సంస్థలనూ కచ్చితంగా కూలుస్తామని స్నష్టం చేశారు. ఆ కూల్చివేతలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి వారికి కాస్త గడువు ఇచ్చారు.
తమ పాలనలో పక్షపాత ధోరణికి ఆస్కారమే లేదని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చి పది నెలలు మాత్రమే అవుతుందన్న షబ్బీర్ అలీ అధికార పై పట్టు సాధించడానికి కొంత సమయం పడుతుందని చెప్పారు. ఎంఐఎం, బీజేపీ పార్టీల మద్య తెరచాటు దోస్తీ ప్రదర్శన. ఎంఐఎం పార్టీకి ప్రధాని మోదీ మద్దతు ఉందనీ, ఔరంగాబాద్ లో ఎంఐఎం ర్యాలీకి రెడ్ కార్పెట్ ఉంటుందన్నారు. 12మందిని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ చేర్పించుకున్నారన్న షబ్బీర్ అలీ తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీ లో ఉన్నపుడు..గవర్నర్ దగ్గరికి తీసుకెళ్లి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారని కేటీఆర్, కేసీఆర్ పై మండిపడ్డారు. దమ్ముంటే చర్చించేందుకు కేసీఆర్, కేటీఆర్ ముందుకు రావాలన్నారు. 1989లో నేషనల్ హెరాల్డ్ కేసులో జైలుకు పోయి వచ్చి మంత్రిని అయ్యానన్న షబ్బీర్ అలీ మళ్ళీ జైలుకు పంపితే మళ్ళీ వచ్చి మంత్రి అవుతానని కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయం కోసం ఏ వంక దొరక్క ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ పేదలకు అందుతున్న విద్యను స్వార్ధానికి వాడుకుంటుందన్నారు.
గురుకులాలకు చెల్లించాల్సిన బిల్లులు ఆలస్యం కావడంతో దాన్ని సాకుగా చేసుకుని విద్యాసంస్థల భవనాలకు తాళాలు వేయడం దారుణమన్నారు. ప్రతిపక్ష పార్టీ ప్రస్తుతం అయోమయంలో పడ్డ నేతలు. అసలు ఆ పార్టీలో అపొజిషన్ నేత ఎవరో అర్ధం కావడం లేదు. కేసీఆరా , కేటీఆరా, హరీష్ రావా అని ఆ పార్టీ నేతలే తేల్చుకోలేకపోతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వేలాది ఉద్యోగాలు భర్తీ చేశామన్న షబ్బీర్ అలీ కేసీఆర్, కేటీఆర్ , హరీష్ రావుకు డీఎస్సీ, గ్రూప్-1 అంటేనే తెలియదన్నారు. పదేళ్ల పాలనలో ఎప్పుడైనా డీఎస్సీ, గ్రూప్-1 నిర్వహించారా అని ప్రశ్నించారు. పదేళ్లు సీఎంగా ఉన్నకేసీఆర్ ఇంజనీరింగ్ కాలేజీలను మూసే కార్యక్రమం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని తెరిచే కార్యక్రమం చేస్తుందన్నారు. నలుగురి ఎమ్మెల్సీలను గుంజుకొని తనను అపోజిషన్ పోగొట్టారనీ, తనకు గంట సమయం కూడా ఇవ్వకుండా, సెక్యూరిటీ లేకుండా ఇంటికి పంపారు. కనీసం టాబ్లెట్లు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని బీఆర్ఎస్ పాలనపై ఫైర్ అయ్యారు.