- రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి
ముద్ర.వనపర్తి:- బక్రీద్ పండగ త్యాగానికి ప్రతీక అని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు భయపడకుండా, దేవుడిపై విశ్వాసంతో సన్మార్గంలో జీవనం సాగించాలని బక్రీద్ పండుగ మానవాళికి గొప్ప సందేశాన్ని ఇస్తోంది.సోమవారం బక్రీద్ సందర్బంగా జిల్లా ఈద్గాలో ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన చిన్నారెడ్డి, జడ్పీ చైర్మన్ లోక్ రెడ్డి వారికి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రవక్తల అచంచలమైన త్యాగ నిరతికి బక్రీద్ పండుగ అద్దం పడ. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు భయపడకుండా, దేవుడిపై విశ్వాసంతో సన్మార్గంలో జీవనం సాగించాలని బక్రీద్ పండుగ మానవాళికి గొప్ప సందేశాన్ని ఇస్తోంది. వారికి ఉన్న దాంట్లో నుండి ఇతరులకు పంచిపెట్టడాన్ని మించిన దాతృత్వం మరొకటి లేదన్న స్ఫూర్తిని చాటిచెపుతోందని చిన్నారెడ్డి అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ పుట్టపాకుల మహేష్, వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణ, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు కొనసాగుతున్నారు.