పట్టింపు లేని విద్యాశాఖ
రేగొండ ముద్ర: సర్కారు బడుల్లో తగ్గుతున్న విద్యార్థుల సంఖ్య.. కారణం ఏమిటి? ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం చాలా వరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు పెరుగుతున్నాయి.. కొన్ని చోట్ల అయితే ప్రైవేటు స్కూల్స్‌తో పోటీ పడుతోంది. నో అడ్మిషన్స్ అనే బోర్డులు పెట్టే పరిస్థితి ఉంది.. ఇలాంటి సమయంలో కూడా రేగొండ మండల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది.. కారణం ఏంటో తెలుసా.? ప్రభుత్వ పాఠశాలలను అందించే విద్యా సంస్థలకు ధీటుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం ఉమ్మడి రేగొండ మండలాల్లో ఆశించిన ఫలితాలు కనిపించడం లేదట. కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య కొంతమేర పెరుగుతోంది.. అనేక పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య తగ్గుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మౌలిక వసతుల కల్పనకు మన ఊరు-మన బడి కార్యక్రమం చేపట్టారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు రవాణా భత్యం అందిస్తోంది.
మధ్యాహ్నం సన్నబియ్యంతో పోషక విలువలు కలిగిన భోజనం పెడుతోంది. అలాగే రాగిజావా, ఉచిత పాఠ్య, రాత పుస్తకాలతో పాటు ఏకరూప దుస్తులు అందిస్తోంది. ఆంగ్ల మాధ్యమాన్ని సైతం ప్రారంభించింది. అయినా పలు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగడం లేదు.మండలంలో పలుచోట్ల ప్రవేశాలు తక్కువఉన్నట్లు తేలింది. పరిశీలనప్రత్యేక దృష్టి సారించమని, బయటి పిల్లలను గుర్తించి, పాఠశాలలో చేర్చాలని జిల్లా విద్యాధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వం గురుకులాలు, కేజీబీవీలు ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయడంతో తల్లిదండ్రులు ఎక్కువగా అటువైపు ఆసక్తి చూపుతున్నట్లు పిల్లల తల్లిదండ్రులు తెలుపుతున్నారు..
ఆయా గ్రామాల పాఠశాలల్లో పిల్లల సంఖ్య చాలా దయనీయంగా ఉంది వారి సుల్తాన్ పూర్ గ్రామంలో ముగ్గురు విద్యార్థులు ఉంటే ఇద్దరు ఉపాధ్యాయులు కొనరావ్ పేటలో ఎనమిది మంది ఉంటే ముగ్గురు ఉపాధ్యాయులు చిన్న కోడెపాక గ్రామంలో నలభై మంది విద్యార్థులు ఉంటే పదిహేను ఉపాధ్యాయులు కాకర్ల పల్లిలో ముప్పై మంది విద్యార్థులు పది మంది ఉపాధ్యాయులు ఇలా గ్రామాల్లో విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. .ప్రభుత్వాలు విద్యార్థుల సంఖ్యను ఎక్కువగా పెంచాలని అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఆశించిన ఫలితాలు రావడం లేదు పుట్టగొడుగుల ప్రైవేట్ పాఠశాలలు పుట్టుకొచ్చిన అధికారులు వత్తాసు పలకడం వల్ల రోజుకు రోజుకు విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల్లో చేరుతున్నారు.మరి కొన్ని గ్రామాల్లో విద్యార్థుల సంఖ్య లేక పోవడంతో పాఠశాలలు మూసి వేసిన పరిస్థితి ఏర్పడింది.