Home తెలంగాణ ఈ నెల 28 నుంచి నిర్మల్ లో రసాయన శాస్త్ర జాతీయ సదస్సు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

ఈ నెల 28 నుంచి నిర్మల్ లో రసాయన శాస్త్ర జాతీయ సదస్సు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
ఈ నెల 28 నుంచి నిర్మల్ లో రసాయన శాస్త్ర జాతీయ సదస్సు - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 28, 29 తేదీల్లో జాతీయ సదస్సు జరగనుందని ప్రిన్సిపాల్ జాడేరావు తెలిపారు. ఈ ముఖ్య అతిథిగా ముఖ్య అతిథి గా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ , ప్రధాన వక్తగా అరింగ్ ప్రొడీవ్, బెంగళూరు సిఐఓ డాక్టర్ రాజేందర్ రెడ్డి హాజరు కానున్నారని తెలిపారు. “సుస్థిర అభివృద్ధిలో రసాయన, శాస్త్రాల పాత్ర” అనే అంశం పై రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు వివిధ రాష్ట్రాల విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల నుండి అధ్యాపకులు తమ పరిశోధన పత్రాలను, వారు కనుగొన్న నూతన ఆవిష్కరణలను సమర్పిస్తారని వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆర్థిక సహాయంతో జరిగే ఈ సదస్సులో 76 పరిశోధన పత్రాలు అందాయని సదస్సు సమన్వయకర్త సరితా రాణి, కో కన్వీనర్ రమాకాంత్ గౌడ్ మాట్లాడారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech