బీబీనగర్, ముద్ర ప్రతినిధి: విద్యాతో పాటు మహిళల అభ్యున్నతికి ప్రభుత్వరంగంలో అందిన వనరుల మేరకు గడిచిన అయిదేళ్లలో ప్రగతి సాధించామని బీబీనగర్ మండల పరిషత్ అధ్యక్షుడు ఎర్కల సుధాకర్ గౌడ్ తెలిపారు. బీబీనగర్ మండల పరిషత్తు సమావేశ మందిరంలో సోమవారం ప్రజాప్రతినిధులకు ఘనంగా వీడ్కోలు సభ జరిగింది. ఈ జాబితాలో బీనగర్బీ జిల్లా ప్రాదేశిక సభ్యురాలు గోలి ప్రణీత పింగళ్ రెడ్డితో పాటు అందరు ఎంపీటీసీ సభ్యులు, తాజా మాజీ సర్పంచులు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీపీ సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ గత కోవిడ్ సమయంలో అందరు ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో జాతీయ స్థాయిలో ఎక్కువ శాతం కోవిడ్ వ్యాక్సినేషన్ వేసిన మండలంగా బీబీనగర్ గుర్తింపు పొందామని అన్నారు. విద్యాభివృద్ధితోనే ప్రగతి ఆధారపడివుంటుందని భావించిన అందరం కలిసి ముఖ్యంగా మండలంలో విద్యాభివృద్ధికి విశేష కృషి చేశామని. అనేక పాఠశాలల్లో విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందించామని తెలిపారు. అలాగే పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపడేందుకు ప్రయత్నించామని తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ సభ్యులు, తాజా మాజీ సర్పంచులు, జడ్పీటీసీ సభ్యురాలు ప్రణీత పింగళ్ రెడ్డి సహా అందరూ అయిదేళ్ల పదవీ కాలంలో తమ అనుభవాలను వివరించారు. మండల ప్రజాపరిషత్ అధికారి శ్రీనివాస రెడ్డి, మండల అభివృద్ధి అధికారి శ్రీధర్ కూడా ప్రజాప్రతినిధులతో తాము ఎలా సమన్వయంతో వ్యవహరించినదీ వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు పంజాల రామాంజనేయ గౌడ్, గోలి నరేందర్ రెడ్డి, టంటం భార్గవ్, వివిధ విభాగాల అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు. చివరిలో ఎంపీపీ సుధాకర్ గౌడ్, జడ్పీటీసీ సభ్యురాలు గోలి ప్రణీత పింగళ్ రెడ్డి తదితరులకు ప్రజాప్రతినిధులు, అధికారులు శాలువాలతో సత్కరించారు. బీబీనగర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సుదర్శన్ సారథ్యంలో విలేకరులంతా కలిసి ఎంపీపీ, జడ్పీటీసీలను సత్కరించారు.