- బీజేవైఎం మండల అధ్యక్షుడు ఉప్పునూతల జగదీష్
భూదాన్ పోచంపల్లి, ముద్ర:- బీజేవైఎం నాయకులు ముందస్తుగా అరెస్టు చేసినంత మాత్రాన ఉద్యమాన్ని ఆపలేరు బీజేవైఎం మండల అధ్యక్షుడు ఉప్పునూతల జగదీష్ అన్నారు. శుక్రవారం నిరుద్యోగ సమస్యలపై రాష్ట్ర బీజేవైఎం మేరకు భువనగిరి కలెక్టరేట్ ముట్టడికి వెళ్తున్న బీజేవైఎం నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు.
ఈ సందర్భంగా నూతల జగదీష్ మాట్లాడుతూ గ్రూప్-1లో 1:100 ప్రకారం క్వాలిఫై చేయడం, గ్రూప్ 2,3లకు అదనంగా పోస్టులను పెంచి నోటిఫికేషన్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మెగా డీఎస్సీ ని నిర్వహించి, జాబ్ క్యాలెండర్ ను వెంటనే విడుదల చేయాలన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చింది, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అందించబడుతుంది. ఈ కార్యక్రమంలో బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్, ఉపాధ్యక్షులు కొత్త నవీన్, ప్రధాన కార్యదర్శి మునగంటి సురేష్, ముద్ధం విజయ్ కుమార్ పాల్గొన్నారు.